ఒక తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న కామిక్ కాన్ లో ఎంట్రీ ఇవ్వడం ఇప్పటివరకు ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో జరగని సంఘటన. అయితే అలాంటి అరుదైన గౌరవాన్ని ‘ప్రాజెక్ట్ కె’ పొందటం కేవలం ప్రభాస్ నాగ్ అశ్విన్ లకు మాత్రమే కాకుండా తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ గౌరవాన్ని పెంచే సంఘటన అంటూ ప్రశంసలు వస్తున్నాయి.


జూలై 20న జరగబోయే కామిక్ కాన్ ఈవెంట్ లో ‘ప్రాజెక్ట్ కె’ టీమ్ తమ టైటిల్ తో పాటు టీజర్ ట్రైలర్ తో కూడిన ప్రత్యేకమైన ఫుటేజ్ ని ఆకార్యక్రమానికి వచ్చే అతిధుల ముందు ప్రదర్శిస్తారని తెలుస్తోంది. ఈ ఫంక్షన్ లో ప్రభాస్ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనె లతో పాటు ‘ప్రాజెక్ట్ కె’ బృందం అంతా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ ఈవెంట్ లో ఈమూవీకి స్థానం దక్కడంతో ఈమూవీ గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలిసే ఆస్కారం ఉంది.




ఈమూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తారని తెలుస్తోంది. మొదటి భాగం వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల అవుతుంటే రెండవ భాగం 2025 సంక్రాంతికి విడుదల చేస్తారని అంటున్నారు. సెప్టెంబర్ 28న ‘సలార్’ రిలీజ్ అయ్యాక ‘ప్రాజెక్ట్ కె’ ప్రమోషన్ చాల ఉధృతంగా చేయాలని ఈమూవీ నిర్మాతల ఆలోచన అని అంటున్నారు.


ప్రపంచ స్థాయి హాలీవుడ్ నిర్మాణ సంస్థలు మార్వెల్ డిస్నీ సంస్థలు తీసే సినిమాల ప్రమాణాలతో ‘ప్రాజెక్ట్ కె’ ను తీర్చి దిద్దాలని దర్శకుడు నాగ్ అశ్విన్ ఈమూవీని ఒక యజ్ఞంలా ఏకాగ్రతతో నిర్మిస్తున్నాడు. ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీలోని ప్రభాస్ పాత్ర శ్రీమహావిష్ణు అవతార ఛాయలతో ఉంటుంది అన్న లీకులు కూడ వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ కు వరస ఫెయిల్యూర్స్ వస్తున్నప్పటికీ ప్రభాస్ నటిస్తున్న సినిమాల రేంజ్ చూస్తుంటే ప్రభాస్ ఇమేజ్ ని ఈ పరాజయాలు ఏమాత్రం ప్రభావితం చేయలేక పోయాయి  అని  అనిపించడం  సహజం ..


మరింత సమాచారం తెలుసుకోండి: