
కావాల్సిన పదార్థాలు:
జామకాయముక్కలు- ఒక కప్పు
మెంతులు- అర టీస్పూను
వేరుశెనగ నూనె- తగినంత
ఉప్పు- తగినంత
ఆవాలు- ఒక టీ స్పూన్
జీలకర్ర- ఒక టీ స్పూన్
కారం- ఒక టేబుల్‌స్పూన్
నిమ్మకాయ- ఒకటి
ఎండుమిర్చి- మూడు
కరివేపాకు- కొద్దిగా
పచ్చిమిర్చి- మూడు
ఇంగువ- చిటికెడు
చింతపండు గుజ్జు- అర కప్పు
పసుపు - ఒక్కో టీస్పూన్
తయారీ విధానం:
ముందుగా జీలకర్ర, ఆవాలు, మెంతులను రెండు నిమిషాలపాటు పాన్‌లో నూనె లేకుండా వేగించాలి. ఇవి చల్లారాక మిక్సీలో గ్రైండ్చేయాలి. ఇప్పుడు ఒక పాన్‌లో వేరుశెనగనూనె పోసి అది వేడెక్కాక ఎండుమిర్చి, కరివేపాకు, జామకాయముక్కలు, ఇంగువ వేసి వేగించాలి. ఆ తర్వాత అందులోనే చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి తరుగు, నిమ్మముక్కలు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి.
ఇప్పుడు అందులో పసుపు, ఉప్పు, కారాలు కూడా కలిపి మరికొంతసేపు ఉడికించాలి. చివరిగా మిక్సీ పట్టిన పొడిని వేసి మరికొద్దిసేపు ఉడికించి స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే యమ్మీ యమ్మీ జామ ఊరగాయ రెడీ..!!