ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... పనీర్ పాయసం.. ఇది ఎంత ఆరోగ్యమైన వంటకమో అంతే రుచికరమైన వంటకం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పనీర్ పాయసం వల్ల చాలా ప్రయోజనాలు వున్నాయి. జీర్ణ శక్తి కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పండగ సీజన్లో త్వరగా అయిపోయే, సింపుల్ తీపి వంటకంగా పన్నీర్ పాయసాన్ని మీరు ప్రయత్నించవచ్చు. ఈ పన్నీర్ పాయసం కేవలం తీపిని ఇష్టపడేవారికే స్వర్గంలాంటిదే కాదు, చాలా త్వరగా అయిపోయే వంటకం కూడా. మరిగి గట్టిపడిన పాలలోకి పన్నీర్ ను చిదిమి వేస్తాం కాబట్టి, ఈ వంటకం చాలా సులభంగా అయిపోతుంది. ఈ తయారీ విధానంలో పాలను, పంచదార ఇంకా పన్నీర్ ను వాడతారు. ఈ రుచికరమైన వంటకాన్ని ఇంట్లో ప్రయత్నించి మీ దగ్గరివారిని సంతోషపర్చండి!

ప్రధాన పదార్థం...

1 కప్ పన్నీర్
1 లీటర్ పాలు
ప్రధాన వంటకానికి
1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి
1/4 టీ స్పూన్ పొడిగా చేసిన యాలకులు
1/4 కప్ చక్కర పొడి

అలంకారానికి....

10  కుంకుమ పువ్వు
అవసరాన్ని బట్టి ముక్కలుగాా కోసిన బాదం
అవసరాన్ని బట్టి తరిగిన పిస్తా పప్పు

పనీర్ పాయసం తయారు చేసే విధానం చూడండి....

ఒక పెనంలో పాలను మరిగేదాకా కలుపుతుండండి. అందులో బియ్యంపిండి వేయండి ఇంకా ఆ మిశ్రమాన్ని 8-10 నిమిషాల వరకూ ఉడకనివ్వండి లేదా పాలు గట్టిపడేదాకా ఉడకనివ్వండి.

పాల మిశ్రమానికి డ్రైఫ్రూట్లు,ఏలకులు, కుంకుమపువ్వు రేకులు వేసి కలపండి. కొన్ని నిమిషాల తర్వాత, పంచదార వేసి మిశ్రమం గట్టిపడేవరకూ ఉడకనివ్వండి.


తక్కువ మంటలో, చిదిమిన పన్నీర్ ను వేసి 2-3 నిమిషాల పాటు బాగా కలపండి.

పాయసాన్ని దించి కప్పులలో వేడిగానో లేదా చల్లగానో వడ్డించండి. దాన్ని వడ్డించేముందు కుంకుమపువ్వు మరియు బాదంపప్పులతో అలంకరించి తర్వాత వడ్డించండి.

ఇలాంటి మరెన్నో కుకింగ్ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: