మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. ఇక దీనికి సంబంధించిన బోర్డులు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా సినిమాల్లో అయితే ఎక్కువగా దర్శనమిస్తూ వుంటాయి. కానీ ఎవరి లో మాత్రం మార్పు రాదు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం అందరికీ తెలుసు. మద్యానికి బానిస గా మారితే ఎన్నో అనర్థాలు జరుగుతాయి అన్న విషయం కూడా తెలుసు.. అంతేకాదు మద్యం తాగి వాహనం నడిపితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అని కూడా అందరికీ అవగాహన ఉంది కానీ..  అందరిలో నిర్లక్ష్యం పేరుకుపోయింది. అందుకే రోజురోజుకు మద్యం తాగే వారి సంఖ్య పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు.


 ఒకప్పటి కాలంలో మద్యం తాగే వాడిని విచిత్రంగా చూసేవారు..  వీడేంటి ఇలా తరచూ మద్యం తాగుతున్నాడు అని చీదరించుకునే వారు. కానీ నేటి రోజుల్లో మాత్రం మద్యం అలవాటు లేని వాడిని విచిత్రంగా చూస్తూ ఉన్నారు. అంతలా మారిపోయింది నేటి లోకం తీరు. అయితే ఇలా రోజురోజుకు మద్యానికి బానిసగా మారిపోతున్న మనుషులు ఎన్నో దారుణాలకు కారణం అవుతున్నారు అని చెప్పాలి.  ఇక్కడ మద్యం ఏకంగా ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమైంది. మద్యం విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఒకరిని హత్య చేసి వరకు వెళ్ళింది.



 ఈ ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట లో వెలుగులోకి వచ్చింది.  నరసరావుపేటకు చెందిన కోటి రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి మద్యం తాగేందుకు ఇటీవలే ఒక బార్ కి వెళ్లారు. ఇక అక్కడ ఫుల్లుగా మద్యం తాగారు. బిల్లు కూడా భారీగానే అయ్యింది.  ఈ క్రమంలోనే బిల్లులో సగం చెల్లించాలి అంటూ కోటిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ని అడిగాడు.  కానీ వెంకటేశ్వర రెడ్డి మాత్రం లేవు అని చెప్పడంతో అప్పటికే మద్యం మత్తులో ఉండడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో అతని తలపై దాడి చేశాడు. ఈ క్రమంలోనే తీవ్ర గాయాలపాలైన వెంకటేశ్వర్ రెడ్డి ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: