అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ ను  వీడుతూ భారీగా అధునాతన ఆయుధాలు వదిలేసి వెళ్ళాయి. వాటిని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు పాకిస్తాన్ కు విక్రయిస్తున్నట్లు  పలు నివేదికలు చెబుతున్నాయి.ఆ ఆయుధాలతో భారత్లో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ఐ కనుసన్నల్లోని ఉగ్ర సంస్థలకు అప్పగించే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్ర మూకల ఏరివేత కోసం రెండు దశాబ్దాలపాటు పోరాటం సాగించి ఈ ఏడాది ఆగస్టులో బలగాల ఉపసంహరణ చేసింది అమెరికా. భారీగా ఆయుధ సంపత్తిని ఆఫ్ఘన్లోనే వదిలేసి బలగాలను తరలించినట్లు పలు నివేదికలు చెప్పాయి. ఇప్పుడు ఆ ఆయుధాలను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది పాకిస్తాన్.

 అగ్రరాజ్యానికి చెందిన అధునాతన ఆయుధాలను ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఆఫ్ఘాన్ నుంచి చేజిక్కించుకున్న అమెరికా ఆయుధాలు తాలిబన్ పాకిస్థాన్ చేతికి వెళ్తాయని  ఆందోళన వ్యక్తం చేసింది. ఇమ్రాన్ ప్రభుత్వం నిషేధిత ఉగ్ర సంస్థ మధ్య ఒప్పందం కుదిరినట్లు  పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్ కు పాక్ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తన దుష్టబుద్ధిని మార్చుకోలేక పోతున్నాడని పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఆ ఆయుధాలు భారత్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

భారత్లోని ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలను అందిస్తారని భావిస్తున్నామని అయితే ఇక్కడ వాటిని వినియోగించేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు సీనియర్ సైన్యాధికారులు. అమెరికాకు చెందిన ఆయుధాలు లోని కొన్ని చిన్న సామాగ్రి పాకిస్తాన్ కు తరలించినట్లు మాకు సమాచారం అందింది. అయితే ఆఫ్ఘన్ పై తాలిబన్ల విజయంతో పాక్ లోని ఉగ్ర ముఠాలకు ధైర్యం వచ్చింది. ఆ ఆయుధాలను పాక్ లోనే   తొలుత ఉపయోగించే అవకాశం ఎక్కువగా ఉందని భారత సైనిక అధికారులు పేర్కొన్నారు. ఈ విధంగా పాకిస్థాన్ ఎప్పుడు ఏదో ఒక  రకంగా ప్రపంచ దేశాల చూపు దానిపై పడేటట్టు చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఈ మేటర్ లో కూడా భారత్ పై తన కక్ష సాధింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: