ఇటీవలే హర్యానాలో ఇలాంటి ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని సోనిపట్ లో ఏకంగా పరువు కోసం తండ్రి మైనర్ కూతురిని దారుణంగా గొంతు నులిమి చంపేశాడు. ఘటన స్థానికులు అందరినీ ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది. అయితే మైనర్ బాలికను చంపేసి ఇక మెట్ల మీద నుంచి పడి మృతి చెందింది అంటూ కొత్త నాటకానికి తెర లేపాడు. తండ్రి చెప్పింది నమ్మి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు లో అసలు నిజాలు బయటపడటంతో ఇక నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అయితే మొదట మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏం జరిగిందని ఆరాతీస్తే మెట్ల మీద నుంచి పడిపోయిందని కుటుంబ సభ్యులు చెప్పారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.. పోస్టుమార్టం రిపోర్టులో గొంతునులిమి హత్య చేసినట్లు తేలింది. ఇక ఆ తరువాత తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. బాలికకు అదే గ్రామంలోని అబ్బాయితో సంబంధం ఉందని.. ఈ విషయం తెలియడంతో కూతురు గొంతు నులిమి హత్య చేశాడు అనే విషయాన్ని ఒప్పుకున్నాడు. మృతురాలి తండ్రినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి