చాలా మందికి భోజనం చేసిన తర్వాత అలా చల్ల గాలికి నడిచే అలవాటు ఉంటుంది.. అయితే కొన్ని సార్లు ఆ అలవాటు చివరికి ప్రాణాలను తీసే వరకూ వెళుతుంది..ఈ రోజుల్లో పట్ట పగలే ఆడవాళ్ళు బయటకు వెళ్ళడం అంటే తల్లి దండ్రులు భయ పడుతున్నారు..అలాంటిది రాత్రి ఒంటరిగా వెళితే ఇక తిరిగి వస్తారా..ఎవరొకరి చేతికి చిక్కడం లేదా హత్యకు గురికావడం జరుగుతున్న సంగతి తెలిసిందే..ఇలాంటి వాటి పై పోలీసులు ఎంతగా చొరవ తీసుకొని కేసు నమోదు చేస్తున్నా కూడా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు..
 

తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది..ఓ మహిళ రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ అని బయటకు వెళ్ళింది..ఎంత సేపు అయిన తిరిగి రాకపోవడం తో ఆమె భర్త తర్వాత రోజు పోలీసులను ఆశ్రయించారు.అన్వేషణ సాగించిన పోలీసులకు అదే రోజు సాయంత్రం ఆమె మృతదేహం లభ్యమైంది.. కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులు మూడ్రోజుల్లో నిందితుడిని కనిపెట్టి అరెస్ట్ చేశారు.వివరాల్లొకి వెళితే...మహారాష్ట్రలోని అదాయ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.అదాయ్ గ్రామానికి చెందిన రేష్మా సచిన్ అనే 33 ఏళ్ల మహిళ ఈ నెల 22వ తేదీ రాత్రి 10 గంటలకు భోజనం చేసి వాకింగ్‌కు వెళ్లింది. రేష్మ ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆమె భర్త తర్వాతి రోజు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్వేషణ సాగించారు. అదే గ్రామంలోని నిర్మాణంలో ఓ భవనంలో రేష్మ మృతదేహం లభ్యమైంది. ఆమె తలపై బలమైన గాయం ఉంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించిన పోలీసులు విచారణ ప్రారంభించారు.రేష్మకు ఆటోలను అద్దెకు ఇచ్చే బిజినెస్ ఉంది. ఆమె నుంచి గతంలో సురేష్ ఒకసారి ఆటో అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య అద్దె విషయమై తీవ్రంగా గొడవ జరిగింది. ఆ కోపంతోనే సురేష్ హత్య చేసి ఉంటాడని రేష్మ భర్త పోలీసులకు చెప్పాడు.అతన్ని పోలీసుల స్తైల్లొ విచారించగా అతను నేరాన్ని అంగీకరించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: