నేటి సభ్య సమాజం లో మనుషులు మానవ మృగాలుగా మారిపోతూ ఉండటం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా భయపడి పోతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల రక్షణ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధులే ఎక్కువగా కనిపిస్తున్నారు. అంతేకాదు నెలలు నిండని పసికందుల నుంచి కాటికి కాలు చాపిన ముసలి వాళ్ళ వరకు కూడా ఎవరిని వదలడంలేదు కామాంధులు. రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి.


 అయితే కేవలం అత్యాచారాలు చేయడం మాత్రమే కాదు అంతటితో ఆగకుండా దారుణంగా హత్యలు చేస్తున్న  ఘటనలు సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. దీంతో ప్రతి ఆడపిల్ల ధైర్యంగా ఇంటి నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. అంతేకాదు సొంత వారి నుంచి కూడా లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. ఎంతో దిక్కుతోచని స్థితిలో దుర్భర జీవితాన్ని గడుపుతుంది ఆడపిల్ల. కాగా పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల లో ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. వృద్ధురాలిని దారుణంగా అత్యాచారం చేయడంతో పాటు హత్య కూడా చేశారు.


 విప్పర్ల కు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు ఎప్పటి లాగానే ఇంటి ముందు నిద్రకు ఉపక్రమించింది. అయితే వేకువ జామున ఎంతకీ లేకపోవడం తో స్థానికులు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందింది. వెంటనే అక్కడికి చేరుకున్న బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. శరీరంపై గాయాలతో పాటు దుస్తులు తొలగించి ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు పోలీసులు. డాగ్ స్క్వాడ్ ల ను పిలిపించి విచారణ చేపట్టారు. అయితే సమీపంలో  ఉంటున్నా మణికంఠ అనే 27 ఏళ్ల యువకుడుని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే తాగిన మైకంలో దాడి చేసి అత్యాచారం చేసినట్లు చివరికి నిజం ఒప్పుకున్నాడు నిందితుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: