ఇటీవల కాలంలో మనుషులు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు చివరికి ఎన్నో కుటుంబాలలో విషాదం నింపుతున్నాయి. అంతేకాదు క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్న తీరు సొంత వారినే దూరం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా మనిషి బంధాలకు బంధుత్వాలకువిలువ ఇవ్వకుండా మానవత్వం అనే పదాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాగా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని  ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి అని చెప్పాలి.


 ఇక్కడ ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. క్షణికావేశంలో  విచక్షణ కోల్పోయిన ఒక వ్యక్తి చివరికి దారుణంగా ప్రవర్తించాడు. ఏకంగా ఏడాదిన్నర వయస్సున్న కుమార్తెను వ్యవసాయ బావిలో విసిరేసాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని  జల్నా లో వెలుగు చూసింది. జల్నా తహసిల్ లోని నిధిన గ్రామంలో జగన్నాథ్ అనే వ్యక్తి వ్యవసాయ కూలీగా పని చేస్తూ ఉన్నాడు. అయితే ఔరంగాబాద్ జిల్లాలోని సిల్లోడ్ కు చెందిన జగన్నాథ్ రెండు నెలల క్రితమే ఉపాధి కోసం ఏడాదిన్నర వయసున్న కూతురు, భార్యతో జల్నాకు వచ్చాడు.


 ఇకపోతే ఇటీవలే భార్యాభర్తల మధ్య ఏదో విషయం లో గొడవ జరిగింది. చివరికి గొడవ చిలికి చిలికి గాలి వానలా పెద్దదిగా మారింది. దీంతో భర్త తీవ్ర ఆగ్రహం తో ఊగిపోయాడు. చివరికి కోపంలో విచక్షణ కూడా కోల్పోయాడు. భార్య మీద కోపంతో ఊయాలలో నిద్రిస్తున్న పసికందును తీసుకెళ్లి సమీపంలోని వ్యవసాయ బావిలో పడేశాడు.  ఈ విషయం మాత్రం భార్యకు తెలియదు. కూతురు కనిపించడం లేదని కంగారు పడిన తల్లి చుట్టుపక్కల ఎంత వెతికిన ఫలితం లేకుండా పోయింది. భర్త అసలువిషయం చెప్పకుండా నాటకం ఆడాడు. చివరికి తలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టుగా చివరికి తండ్రి చేసిన దారుణం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: