
ఇక వేధింపులు తట్టుకోలేక చివరికి మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు అని చెప్పాలి. ఈ ఘటన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం లో వెలుగు చూసింది అని చెప్పాలి. గంగుల రాటాలు అనే 50 ఏళ్ల వ్యక్తి తిరుమల స్టేట్ బ్యాంకులో 2.1 లక్షల రుణం తీసుకున్నాడు. అయితే అతను సక్రమంగానే వడ్డీ చెల్లిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ అరేళ్ళ క్రితం తీసుకున్న 3,00,000 రుణం కోసం షూరిటీ సంతకం చేసాడు. అయితే సత్యనారాయణ రుణం మళ్లీ తిరిగి చెల్లించలేదు. దీంతో షూరిటీగా ఉన్న రాటాలు పై పగ తీర్చుకున్నారు బ్యాంకు అధికారులు. అకౌంట్ బ్లాక్ చేయడం ఏటీఎం కార్డును కూడా బ్లాక్ చేసి ఇబ్బందులకు గురి చేశారు కూతురు వైద్యం నిమిత్తం తన అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా.. అసలు విషయం తెలిసింది. అయితే లోన్ కట్టమని స్నేహితుడు సత్యనారాయణ ను అడిగిన ప్రయోజనం లేకపోయేసరికి మనస్తాపం చివరికి రైల్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.