సాధారణంగా ఉత్తరాఖండ్ ను  దైవభూమి అని అందరూ అభివర్ణిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అక్కడ జరిగే చార్ధామ్ యాత్ర కోసం దేశ నలుమూలల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఈ స్థలానికి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అని చెప్పాలి. అయితే ఎప్పుడు ఇక కేదార్నాథ్ ఆధ్యాత్మికతతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది అని చెప్పాలి. కానీ గత కొంతకాలం నుంచి అక్కడ జరుగుతున్న విచిత్రమైన ఘటనల కారణంగా ఆ ప్రాంతం వార్తల్లో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోతుంది.



 ఇక ఇప్పుడు ఒక వివాదాస్పద విషయంతో మరోసారి కేదార్నాథ్ వార్తల్లో నిలిచింది. ఇద్దరు యువకులు చేసిన పనికి ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఏకంగా గుర్రానికి బలవంతంగా గంజాయి తాగించేందుకు ప్రయత్నించారు.  ఈ వీడియో కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోయింది. సాధారణంగా కేదార్నాథ్ యాత్రలో అక్కడికి వెళ్లిన భక్తులందరూ కూడా ఇక ఎక్కువగా గుర్రాలను ఉపయోగిస్తూ ఉంటారు. కొండపైకి ఎక్కే శక్తి లేని వారు ఇలా గుర్రపు స్వారీ ద్వారా కొండపైకి చేరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అటు గుర్రపు నిర్వాహకులు కూడా గుర్రపు స్వారి అందుబాటులో ఉంచడం ద్వారా భారీగానే ఆదాయాన్ని పొందుతూ ఉంటారు.


 కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే మాత్రం మరోసారి అక్కడికి వెళ్లిన యాత్రికులు గుర్రపు స్వారీ చేయాలంటే భయపడి పోతారు. ఏకంగా ఇద్దరు యువకులు గుర్రం నోరు పట్టుకుని గంజాయి తాగించారు. ఒకరు గుర్రం ముక్కు రంధ్రాలను మూసేస్తే.. మరొక యువకుడు గుర్రం కి గంజాయిని నాసికా రంద్రం ద్వారా బలవంతంగా తాగించేందుకు ప్రయత్నించాడు. ఇలా గుర్రానికి మత్తు మందు ఇస్తే చివరికి వాటిపై స్వారీ చేసే ప్రయాణికులకు ప్రాణాలకు ముప్పు వాటిలో ప్రమాదం ఉంది. దీంతో ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: