సాధారణ మానవుడికి ఏ కష్టం వచ్చినా పోలీస్ స్టేషన్ కి పరుగెడుతాడు. అక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందని భావిస్తారు. అలా న్యాయం చేయాల్సిన పోలీసులే  అడ్డదారి తొక్కితే పరిస్థితి ఏంటి.. ఈ మధ్యకాలంలో  కొంతమంది పోలీసు అధికారులు చేస్తున్నటువంటి పనుల వల్ల ఆ డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు వస్తోంది. అయితే తాజాగా ఒక మహిళ ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఆ సీఐ ఆ మహిళ మెడలోనే తాళి కట్టేసాడు. మరి ఆ సీఐ ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. నంద్యాలలో సిసిఎస్ సిఐ గా పని చేస్తున్నటువంటి సురేష్ కుమార్ పై మదనపల్లిలోని పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. అయితే ఆయనపై పవన్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేసి కేసు నమోదు చేశారు. 

పవన్ కుమార్ కు  2018లో కలికిరి ప్రాంతానికి చెందిన మహిళతో వివాహమైంది. పవన్ కుమార్ దుబాయిలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉండేవారు. అయితే ఈయన భార్య కుటుంబంలో ఏర్పడిన సమస్యల వల్ల  డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఇదే టైంలో ఆమెను పరిచయం చేసుకున్న సురేష్ కుమార్ మెల్లిగా ట్రాప్ చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెకు పెళ్లి అయినట్టు 2021లో పవన్ కుమార్ కు తెలిసింది. కానీ ఆయనపై ఎక్కడ ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆవేదన చెందిన పవన్ కుమార్  పీఎంఓ కు ఫిర్యాదు చేశాడు.

వెంటనే స్పందించిన పీఎంఓ అధికారులు  జూన్ లో మదనపల్లి పోలీస్ స్టేషన్లో సీఐపై కేసు నమోదు చేశారు. అయితే సీఐ సురేష్ కుమార్  తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకున్నారు. తల్లి యొక్క కుల ధ్రువీకరణ పత్ర ఆధారంగా ఆయన సర్టిఫికెట్ పొందాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పవన్ కుమార్ పీఎంఓలో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా చేసుకున్నటువంటి పోలీసులు సురేష్ కుమార్ పూర్తి బయోడేటా లాగే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు అక్కడి రెవెన్యూ అధికారులు ఆయన కుల ధ్రువీకరణ పత్రంపై  విచారణ కూడా చేపట్టారు. కానీ సదరు సీఐ ఈ సమయంలో అధికారులకు సహకరించకపోగా సెలవు పై వెళ్ళిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: