చాకిరి ఎక్కువ... శాలరీ తక్కువ. ఖర్మ కొద్దీ ఈ ఫీల్డ్ లోకి వచ్చాం ! చెప్పుకోవడానికి గొప్పగా ఉంది కానీ, అంత గొప్పగా జీతాలు ఉండవు. జర్నలిస్ట్ అంటే కాలర్ ఎగరేసుని పోయాయి బాసు... ఛీ ఛీ పనికిమాలిన ఉద్యోగం అని తీరిగ్గా తిట్టుకోవడమే ఇప్పుడు ఉద్యోగులకు మిగిలింది. అవునవును ఇప్పుడు జర్నలిస్ట్ ల పరిస్థితి అలాగే తయారయ్యింది. మూలిగే నక్క మీది తాటికాయ పడ్డట్టుగా పరిస్థితి తయారయ్యింది. ఇక్కడ ఎవరిని ఎవరు నిందించుకున్నా పరిస్థితి అయితే ఇలాగే ఉంది. ఇప్పుడు విషయంలోకి వచ్చేద్దాం...! 

 

IHG


ఫలానా సంస్థల్లో ఉద్యోగులకు తక్కువ జీతాలు ఇస్తున్నారని, పనికి తగ్గ వేతనం దక్కడంలేదని, ఎన్ని మానవీయ కోణంలో కథనాలు రాసే జర్నలిస్టుల జీవితాలపై యాజమాన్యాలకు కనీసం కనికరం కూడా లేకుండా పోయింది. ఇస్తున్నది అరకొర జీతాలు ఇప్పుడు అందులోనూ కరోనా పేరు చెప్పి మొత్తం ఉద్యోగ జీవితాలకు, జీతాలకు పంగనామం, పెట్టే దిశగా యాజమాన్యాలు అడుగులు వేస్తుండడంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో మీడియా సంస్థల ఉద్యోగులు ఉన్నారు.

 

ఇప్పటికీ మీడియా సంస్థలు ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నాయి. అంతే కాదు అరకొరగా జీతాలు ఇస్తున్నాయి. కరోనా పేరు చెప్పి మరింతగా కోతలకు సిద్ధమయ్యాయి. ఒకవైపు కష్టాలు మరో వైపు యుద్ధాలతో మీడియా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఇలాంటి సందర్భం వస్తే చెలరేగిపోయే ఆంధ్రజ్యోతి వంటి సంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయట. ఆంధ్రజ్యోతి ప్రతి నెల ఉద్యోగుల జీతాల్లో 20 శాతం కోతలు విధిస్తామని చెప్పి మరో 05 శాతం పెంచి కోత విధించింది. ఇక వచ్చే నెలలో ఎంత కోతకు గురవుతుందో చెప్పలేని పరిస్థితి ఆ సంస్థలో ఉందట. అక్కడ పనిచేసే సిబ్బందికి 60 శాతం మాత్రమే జీతాలు ఇవ్వడంతో అందులో పనిచేసే సిబ్బంది తీవ్ర స్థాయిలో గగ్గోలు పెడుతున్నారు.


 ఇక ఇప్పుడు జ్యోతి మరో ఎత్తుగడకు తెర తీసినట్టుగా ఆ సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించుకుంటున్నాయి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి కూడా అదే వర్క్ ఫ్రమ్ హోం ఫార్ములా తెర మీదకు తెచ్చింది. నిజానికి ఆఫీసుకు పోయి చేసే పనే ఇంటి ఇంటి నుంచి చేయాలి కదా ..అయినా మీరు ఇప్పుడు ఫీల్డ్ లో తిరిగే పని ఏమీ లేదు కదా చెబుతూ ఆంధ్రజ్యోతి కొంతమంది ఫీల్డ్ రిపోర్టర్లకు ఇచ్చే జీతంలో 50% కోత విధించిందట. దీంతో ఆ సంస్థలో పని చేసే సిబ్బంది తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. నిత్యం నీతి సూక్తులు చెప్పే రాధాకృష్ణ తమ సొంత ఉద్యోగుల విషయంలో ఇలా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: