కింద పడిన పైచేయి నాదే అన్నట్టుగా కొంతమంది వ్యవహారశైలి ఉంటుంది. ఓడినవారు గెలిచిన వారిపై పెత్తనం చేసేందుకు చూస్తారు. కుదరకపోతే కత్తులు నూరుతూ అడుగడుగున ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఈ తరహా సంఘటనలు రాజకీయాల్లో ఎక్కువగా చోటుచేసుకుంటాయి. ప్రజలు తమ సమస్యలు పరిష్కరించమని కోరుకుంటున్నా, ఇంకా తామే అధికారంలో ఉన్నామనే భ్రమ నుంచి కొంతమంది బయటికి రారు. అసలు తాము ఓడిపోవడానికి కారణం ప్రజలని, ప్రజలు తప్పు చేశారని, తాము నిప్పు అని గొప్పలు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విషయంలో అందరి కంటే నాలుగాకులు ఎక్కువే చదివారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. గత టిడిపి ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం కంటే సొంత పార్టీ నాయకుల సంక్షేమమే ముఖ్యం అన్నట్టుగా విచ్చలవిడిగా వారు అవినీతికి పాల్పడిన తీరు చూసీచూడనట్టుగా వదిలి వేయడం, వారి వారి అవినీతిలో వాటా కూడా తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కోవడం వంటివి తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. 

 

IHG


40 ఏళ్ల రాజకీయ అనుభవం, పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా అనుభవం, అన్నీ ఉన్నా... చంద్రబాబులో అసూయ, అసహనం ఎక్కువగా కనిపిస్తోందనే వాదనలు లేకపోలేదు. తన కొడుకు వయసు వాడితో తాను తన పడాల్సి వస్తుందనే బాధ చంద్రబాబు లో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీ కథ ముగిసిన అధ్యయనం అని, టిడిపి ప్రభుత్వం లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై జగన్ ప్రభుత్వం దృష్టిపెట్టి టిడిపి నాయకులు అందరిని జైలు బాట పట్టిస్తోంది అని పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, అధికార పార్టీ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అదే జరిగితే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవాల్సి ఉంటుంది అనే బాధ చంద్రబాబు లో ఎక్కువ ఉంది. కానీ ఆ భయాన్ని ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. 


అసలు ప్రజలు తప్పు చేశారు కాబట్టి జగన్ ముఖ్యమంత్రి పీఠం పై కూర్చున్నారని, జగన్ ముఖ్యమంత్రి అయినా, అసలు సీఎం పదవికి తానే అర్హుడిని అన్నట్టుగా చంద్రబాబు ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. పార్టీకి సంబంధించి సుప్రీమ్ గా ఉంటూ వస్తున్న చంద్రబాబు ఇప్పుడు సుప్రీం. కానీ ప్రభుత్వానికి కూడా తానే సుప్రీం అన్నట్టుగా, తాను చెప్పినట్టుగానే జగన్ పరిపాలన చేయాలని, నిర్ణయాలు తీసుకోవాలి అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఏడు పదులు వయసులోనూ చంద్రబాబు విశ్రాంతి లేకుండా, పార్టీ కోసం కష్టం కష్టపడుతూనే ఉన్నారు. 


2024 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా, సీఎం కుర్చీ పై మరోసారి కూర్చోవాలి అన్నట్టుగా చంద్రబాబు వ్యవహార శైలి కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఏపీ ప్రభుత్వం అన్ని నిర్ణయాలు సక్రమంగా, నిజాయితీగా తీసుకోకపోవచ్చు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో ప్రభుత్వం తప్పు చేస్తుంది. ఆ సమయంలో ప్రతిపక్షాలు ప్రజల తరఫున నిలబడి ప్రభుత్వ తీరును ప్రశ్నించి, అంతిమంగా ప్రజలకు న్యాయం జరిగేలా చేయాలి. కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టేసి కేవలం రాజకీయ కోణం లో మాత్రమే చూస్తూ, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబడుతూ అంతిమంగా ప్రజలే నష్ట పోయే లా చేస్తూ ముందడుగు వేస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ తానే ముఖ్యమంత్రి అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: