టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి రాజకీయ జీవితం ఇక ముగిసినట్టేనా..? దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈ రాజకీయ చాణక్యుడు ఇప్పుడు బొక్కబోర్లా పడ్డాడా..? నా అనుకున్న వాళ్ళే ఆయనని నట్టేట ముంచుతున్నారా..? చంద్రబాబు ఏకాకి కాబోతున్నారా..? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవునని చెప్పక తప్పదు.
2019లో అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంక్షేమమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు.. అలాగే, ప్రతిపక్షమైన టీడీపీ మీద కూడా ఫోకస్ పెట్టారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి చంద్రబాబు కు ఉన్న ప్రతిపక్ష హోదాను తీసివేసేందుకు ముమ్మరంగా వైఎస్సార్సీపీ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకి హ్యాండ్ ఇచ్చి.. సీఎం జగన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే ఆషాఢ మాసంలో మాత్రం ఈ వలసలకు కాస్త బ్రేక్ పడింది. కానీ, ఇప్పుడు శ్రావణ మాసం రావడంతో వలసలు కూడా మొదలవ్వబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో చంద్రబాబు టీం నుంచి మరికొందరు జారి పోయే అవకాశముంది.
ఇప్పటికే మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. దానికి ఆగస్టు 15వ తేదీని ఆయన ముహూర్తంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే గంటా శ్రీనివాసరావు పార్టీ మారడం వెనుక ఓ మంత్రి కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. కాగా, ఇప్పుడు అదే మంత్రి ఆద్వర్యంలో మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు రెడీ అయిపోయారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాలిగిరి,కరణం బలరాంలు పార్టీని వీడటంతో చంద్రబాబు బలం 20 కి పడిపోయింది.
తాజాగా గంటా కూడా పార్టీని వీడతారన్న ప్రచారంతో 19కి చేరుకుంది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడితే చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ముప్పు ఏర్పడినట్లేనని స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీంతో అప్రమత్తమైన చంద్రబాబు ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా ఫోన్ చేసి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయినా ఆ ఎమ్మెల్యేలు మాత్రం మంచి ముహూర్తం చూసుకుని సీఎం జగన్ కి జై కొట్టేందుకు రెడీ అయిపోయిన్నట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి