ఒక్కోసారి ఏమి రాస్తున్నాడో తనకు కూడా అర్ధం అవుతున్నట్లు లేదు ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు. జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లేస్తున్నామని అనుకుని అదే చంద్రబాబునాయుడు భాగోతాన్ని కూడా రోడ్డున పడేస్తున్నాడు. తాజాగా చంద్రబాబు హయాంలో జరిగిన ట్యాపింగ్ గురించి శనివారం వచ్చేసిన ఆదివారం కొ(చె)త్తపలుకులో స్సష్టంగా చెప్పటం సేమ్ సైడ్ గోల్ వేసుకున్నట్లే ఉంది. ’హలో వింటున్నారా’ అనే హెడ్డింగ్ తో రాసిన కథనమంతా ఉత్త చెత్త మాత్రమే. ఏదో రకంగా జగన్ పై బురద చల్లేయాలి, వైసిపి ప్రభుత్వాన్ని గబ్బు పట్టించాలన్న తాపత్రయమే కానీ తాను అచ్చేస్తున్న కథనాల్లో వాస్తవం ఎంతుందన్నది చూసుకోవటం లేదు. ఆమధ్య ఇదే చెత్తపలుకులో రాసినట్లు ’ఏదో అప్ప ఆరాటమే కానీ బావ బతికే ఛాన్సేలేదు’ అన్నట్లుగా పతనం అంచునున్న టిడిపికి మళ్ళీ ఊపిరూది లేచి నిలబెట్టాలని రాధాకృష్ణ ఆరాటమే కానీ పార్టీ పుంజుకునే అవకాశాలైతే కనబడటం లేదు.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే జగన్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందంటూ ఆధారాలు చూపకుండానే ఓ కథనం రాసేశారు. ఇపుడు దాన్ని నిజమని నిరూపించేందుకు నానా అవస్తలు పడుతున్నారు. ఇందులో భాగంగానే రాసిన చెత్తపలుకులో ఫోన్ ట్యాపింగ్ అన్నది ఇందిరాగాంధి హయాం నుండి జరుగుతున్నదే అంటూ రాధాకృష్ణ సెలవిచ్చాడు. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాలపై నిఘా పెట్టడం సర్వసాధారణమైపోయిందని రాధాకృష్ణే అంగీకరించాడు. అంటే అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించినట్లు ఎల్లోమీడియా అంగీకరిస్తున్నట్లే కదా ? పైగా చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు వైసిపి నేత ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణారెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేయించినట్లు చేసిన ఆరోపణల్లో వాస్తవమే అని ఒప్పుకున్నాడు. సజ్జల ఫోన్ను చంద్రబాబు ట్యాపింగ్ చేయించినట్లు రాధాకృష్ణే సర్టిఫై చేసేశాడు. బహుశా తాను చేయించిన ఫోన్ ట్యాపింగ్ ను రాధాకృష్ణ బయటపెట్టడంతో చంద్రబాబుకు షాక్ కొట్టుంటుంది.
ఫోన్ ట్యాపింగ్ అంశంతో హోంమంత్రికి కానీ లేదా డిజిపికి కూడా ముఖ్యమంత్రి తెలియనివ్వడని కూడా రాధాకృష్ణే చెప్పాడు. ప్రతిపక్ష నేతల ఫోన్లే కాదు చివరకు మంత్రులు, ఉన్నతాధికారుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతోందేమో అనే అనుమానాన్ని కొందరు రాధాకృష్ణ దగ్గర వ్యక్తం చేశారట. ప్రత్యర్ధులంటే ప్రతిపక్షాల వాళ్ళు మాత్రమే అని రాధాకృష్ణ ఎలాగనుకున్నాడు ? స్వపక్షంలో నరసాపురం ఎంపి కనుమూరి రఘురామకృష్ణంరాజు లాంటి ప్రత్యర్ధులు కూడా ఉంటారు కదా ? మరి అలాంటి వాళ్ళ విషయంలో జగన్ జాగ్రత్తలు తీసుకోవాలని అనుకోవటం తప్పెలాగవుతుంది ? అధికారం అనే సింహాసనం మీద కూర్చున్న వాళ్ళకు ఎటువైపు నుండి ఏరోజు ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి సింహాసనం మీదున్న వాళ్ళు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. ఈ జాగ్రత్తలు తీసుకోవటంలో తన మన అన్న తేడా ఉండదు. ఇటువంటి విషయంలో అప్పట్లో ఏమరుపాటుగా ఉండబట్టే ఆరోజుల్లో ఎన్టీయార్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడవగలిగాడు. అప్పట్లోనే ఎన్టీయార్ జాగ్రత్తగా ఉండుంటే చంద్రబాబు అసలు ముఖ్యమంత్రయ్యేవాడేనా ?
ఇక ప్రభుత్వ యంత్రాంగంలో ఉంటున్న ఉన్నతాధికారుల్లో కొందరు ప్రతిపక్షాలకు సహకరించే వాళ్ళు కూడా ఉంటారు కదా. పైగా ఎదుటి వాళ్ళను ప్రలోభలకు గురిచేయటంలో చంద్రబాబును మించినవాళ్ళు లేరనే ప్రచారం అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్నపుడు వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, 3 ఎంపిలను ఎలా ప్రలోభాలకు గురిచేసింది, టిడిపిలోకి లాక్కున్నది కళ్ళ ముందే కనిపిస్తున్నపుడు ఎవరి విషయంలో అయినా జగన్ గుడ్డినమ్మకంతో ఉంటాడని రాధాకృష్ణ ఎలాగ అనుకున్నాడో ? చివరగా న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్ అంటారా ఇప్పటికి దానిపై ఆధారాలేమీ లేదు. తాము ఎవరిపైనా ట్యాపింగ్ చేయటం లేదని ప్రభుత్వం తరపున ఓ వివరణ వచ్చింది. నిజానికి ట్యాపింగ్ జరిగిందని నిరూపించటం అంత సులభం ఏమీకాదు. ఒకవేళ న్యాయమూర్తుల ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందని రుజువైతే ఆ ట్యాపింగ్ చేయటం ద్వారా వెల్లడయ్యే విషయాలు మాత్రం సంచలనంగా మారుతాయనటంలో సందేహం లేదు. సో లెటజ్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి