విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చిన చంద్రబాబు... అక్కడే ప్రెస్ మీట్‌ పెట్టి.. రాజధాని అంశంపై మాట తప్పిన సీఎం జగన్‌ను ఆ దుర్గమ్మ క్షమించదని కామెంట్ చేయడం కలకలం రేపుతోంది. చంద్రబాబు విమర్శలపై మంత్రులు మండిపడుతున్నారు. అసలు.. దుర్గమ్మ దర్శనానికి వచ్చి రాజకీయాలు మాట్లాడటం సరికాదని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం సీఎం జగన్ పని చేస్తున్నారన్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ... ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం ఏపికి జరగకూడదని సీఎం అడుగులు వేస్తున్నారని తెలిపారు.


చంద్రబాబు 10ఏళ్ల ఉమ్మడి రాజధాని ఎందుకు వదిలి వచ్చామో చెప్తే బాగుండేదన్న  మంత్రి కొట్టు సత్యనారాయణ... రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. చంద్రబాబు స్వార్థం వదిలి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మాట్లాడాలని  మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. విజయవాడలో క్యూ కాంప్లెక్స్ ఒకటి కట్టి 150కోట్లతో అభివృద్ధి చేశా అని చెప్పడం ఏంటని  మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. అమరావతి రాజధాని కాదని సీఎం జగన్ ఎక్కడా చెప్పలేదని.., రాజధాని అమరావతి కాబట్టి ఇల్లు ఇక్కడ కట్టుకున్నారని  మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.


అంతేకాదు.. చంద్రబాబు  కోరుకున్నట్లు రియల్ ఎస్టేట్ రాజధాని ఏర్పాటు చేయమంటే మాత్రం సాధ్యం కాదని  మంత్రి కొట్టు సత్యనారాయణ అంటున్నారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సీఎం మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. సీఎం జగన్ రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే.. చంద్రబాబు కోర్టులో కేసులు వేయించింది నిజం కాదా అని మంత్రి కొట్టు సత్యనారాయారణ నిలదీశారు. అయితే.. పండుగ పూట.. అందులోనూ అమ్మవారి దర్శనానికి వచ్చి కూడా చంద్రబాబు రాజకీయాలు మాట్లాడటం సరికాదని పలువురు రాజకీయ నాయకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: