
అలాగే మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు దాదాపు 20, 25 స్థానాల వరకు గెలుచుకుంటారని వెల్లడించింది. అయితే బీహార్ లో కూడా ప్రతిపక్షాలు పుంజుకునే అవకాశం ఉందని తెలిపింది. ఈ మూడు ప్రాంతాల్లో కలిపి దాదాపు 43 స్థానాలు ఎన్డీఏ దాని మిత్ర పక్షాలు కోల్పోయే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వేలో వెళ్లడైంది. ఇండియాలో ఎక్కువ శాతం ఇండియా టుడే నిర్వహించిన సర్వే ప్రకారం నిజమయ్యాయి.
ఆ ఫలితాలు అనేవి అటు ఇటుగా దాదాపు 80 శాతం వరకు ఇండియా టుడే నిర్వహించిన సర్వేలు నిజమయ్యాయి. కాబట్టి ఇప్పుడు నిర్వహించిన ఈ సర్వే ఎంత మేరకు నిజమవుతుంది అనేది వచ్చే సాధారణ ఎన్నికల తర్వాత తేలనుంది. మూడు నెలలకు ఒకసారి ఇండియా టుడే కూడా మూడ్ ఆఫ్ ది నేషనల్ అనుకుంటూ సర్వే నిర్వహిస్తుంది. భారత్ లో ఉండే పరిస్థితులు ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఎన్నికలు వాటి ఫలితాలు రాజకీయ నాయకులు ఆయా పార్టీల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ప్రజల నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటూ వాటిని తెలియజేస్తూ ఉంటుంది.