ఒక్క దెబ్బకు రెండు పిట్టలా కాన్సెప్ట్ అనే పద్ధతి చంద్రబాబు పాటిస్తున్నట్లు ఉంది. గతంలో మున్సిపాలిటీ, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వైసీపీ గెలిచిన సమయంలో టీడీపీ ఏ మాత్రం చప్పుడు చేయలేదు. కానీ మూడు రాజధానుల విషయంలో మాత్రం చంద్రబాబు జగన్ కు సవాలు విసిరేలా కనిపిస్తున్నారు.


ఇన్ని రోజులు ఎవరు పోటీ చేసినా, ఎక్కడ పోటీ చేసినా వైసీపీ రెడీ అంటూ ఢంకా బజాయించి చెప్పేది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఇలాంటి ఛాలెంజ్ లు వైసీపీ చేయగలదా.. ఇలాంటి సమయంలో చంద్రబాబు తన రాజకీయ చతురతను ఉపయోగించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. నెల్లూరు నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఆనం కూడా టీడీపీ బాట పట్టినట్లే కనిపిస్తున్నారు. అయితే వీరిద్దరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే వైసీపీ కోటం రెడ్డి ని డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటిస్తే అప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది.


ఇన్ని రోజులుగా వైసీపీ తన దూకుడును ప్రదర్శించింది. కానీ మొన్న జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎన్నికల అనంతరం కాస్త సైలెంట్ అయినట్లే కనిపిస్తుంది. నాలుగేళ్ల నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే సరికి తెలుగు తమ్ముళ్ల ఉత్సాహం పెరిగింది.


వైసీపీకి వ్యతిరేకంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు మొదటి నుంచి దాడి చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు గనక ఈ రఘురామతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు పోతే ఎవరి సత్తా ఏందో తెలుస్తుందనే భావన చర్చ తెరపైకి వచ్చింది. కానీ రఘరామరాజు 5 ఏళ్ల వరకు మధ్యలో పోటీ చేయనని ఇలాగే వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటానని చెప్పాడు. ఒక వేళ చంద్రబాబు ఆయన్ని ఒప్పించగలిగితే అక్కడ టీడీపీ గెలిస్తే ఇక వైసీపీ కి కష్టంగా మారుతుందని కొంతమంది మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: