తెలంగాణలో కేసీఆర్ ని దెబ్బ కొట్టడానికి భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా సపోర్ట్ చేసుకుంటూ వచ్చిందని తెలుస్తుంది. ఆంధ్రజ్యోతి తెలంగాణ గాని, టీవీ 5 గాని భారతీయ జనతా పార్టీని బాగానే హైలెట్ చేసుకుంటూ వచ్చాయి. అయితే వీటికి ఈ మధ్యన భారతీయ జనతా పార్టీపై అభిప్రాయం మారిందని తెలుస్తుంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయట.


అవి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకపోవడం, పొత్తు ఇంకా కన్ఫర్మ్ అవ్వకపోవడం వాటిలో ఒకటి. భారతీయ జనతా పార్టీ ఈ మధ్యన కర్ణాటకలో జరిగిన ఎలక్షన్స్ లో ఓడిపోవడం రెండవ కారణమని తెలుస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మనిషి అవ్వడం, ఆయనపై ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి అభిమానం ఉండడం మరో కారణంగా తెలుస్తుంది.


ఇంకో విషయం ఏమిటంటే  భారతీయ జనతా పార్టీని ఇప్పుడు దెబ్బ కొట్టకపోతే ముందు ముందు ఏమి చేయలేము అని కూడా అనుకుంటున్నారట. దాంతో కాంగ్రెస్ పార్టీ ని ఇప్పుడు ఈ మీడియా వర్గాలు మోస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ నెగ్గాలని కోరుకుంటున్నాయని తెలుస్తుంది. దానికోసమే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో  మూడవ స్థానంలోకి పడిపోయిందని ప్రచారం చేసుకు వస్తున్నాయి ఇక్కడ మీడియా వర్గాలు.


ఈ విషయం కూడా చెప్పింది ఎవరంటే బిజెపికి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు వాట్సప్ చిట్ చాట్ లో చెప్పారని ఆంధ్రజ్యోతి చెబుతుందట. అయితే ఈ వాట్సాప్ గ్రూపులో ఈ ప్రచారాలు కూడా ఒక పథకం ప్రకారం చేసుకు వస్తారని తెలుస్తుంది. యాక్చువల్ గా ఒక ప్రచారాన్ని వీళ్లే వాట్సప్ గ్రూపులో క్రియేట్ చేసి రెండవ రోజు దాన్ని వార్తగా వైరల్ చేస్తారని తెలుస్తుంది. ఇక్కడ తెలంగాణలో అయితే  టిఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ తప్ప భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకూడదని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP