కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులను కానీ మంత్రులను టీడీపీ అధినేత చంద్రబాబు కలవచ్చు. వైసీపీ అధినేత జగన్ కలవచ్చు. కానీ చంద్రబాబు కలిస్తే ఒకలా.. జగన్ వెళ్లి కలిస్తే మరోలా విష ప్రచారం చేస్తున్నాయి టీడీపీ అనుకూల మీడియా. అమిత్ షాను ఈ మధ్య చంద్రబాబు కలిశారు. గతంలో ఆంధ్రలో బీజేపీ గెలిచిన సీట్లలో ఏ ఒక్క చోట కూడా వైసీపీ బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేయలేదు. కానీ టీడీపీ పొత్తు పెట్టుకుని మరీ సపోర్టు చేసింది.
అదే విధంగా వపన్ కల్యాణ్ నిలుచున్న ప్రాంతాల్లో టీడీపీ వ్యతిరేక ప్రచారం కూడాా చేయలేదు. కానీ బీజేపీ కోసం పని చేసింది టీడీపీ అయితే జగన్ బీజేపీతో కలిసి ఉన్నట్లు ప్రచారం చేస్తూనే అమిత్ షా, నడ్డా లు జగన్ ను విమర్శించడం మొదలు పెట్టగానే పతాక శీర్షికల్లో వార్తలు రాస్తున్నారు. జగన్ అవినాష్ రెడ్డి విషయంలో కూడా తప్పు చేస్తున్నట్లు పుంఖానుపుంఖాలుగా రాస్తూనే ఉన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన విమర్శలకు జగన్ కౌంటర్ ఇస్తారా? ఇవ్వరా అనే చర్చ మొదలైంది. అయితే నడ్డా విమర్శలు చేసిన సమయంలో కొడాలి నాని లాంటి వారు వాటిని తిప్పి కొట్టారు. కానీ అమిత్ షా చేసిన విమర్శలను జగన్ తిప్పి కొడతారా? లేక కేసులకు భయపడి ఊరుకుంటారా అనే చర్చ తీవ్రంగా నడుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి