
అందుకే వాళ్ళు కొత్త కాన్సెప్టు పై దృష్టి పెట్టారని అంటున్నారు. అదే 175 కి 175 సీట్లు కచ్చితంగా గెలవాలి అనే కాన్సెప్ట్. అంటే దీనిలో పవన్ కళ్యాణ్ ప్రసక్తి లేదని తెలుస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీని గౌరవప్రదమైన స్థానాలు ఇవ్వమని అడగడం జరిగింది. గౌరవప్రదమైన స్థానాలంటే 50కి తగ్గకూడదు. కానీ తెలుగుదేశం పార్టీ 22 కి మించి ఇవ్వదని తెలుస్తుంది.
గట్టిగా ఇస్తే 25 వరకు ఇస్తుంది అంతే తెలుగుదేశం. కానీ 22, 25 స్థానాలు అంటే అది ప్రజల్లో తనకు అవమానం జరిగినట్లే అని భావించిన పవన్ కళ్యాణ్ అందుకు సుముఖత చూపలేదని అర్థమవుతుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన ప్రచారంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం కూడా పవన్ కళ్యాణ్ కు మాత్రమే సంబంధించిన నైజం అని తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారట.
అందుకే 175 స్థానాలు అనే స్టేట్మెంట్ ని వెలుగులోకి తెచ్చారు. అంటే ఈ స్టేట్మెంట్ వెనకాల ఉన్న పరోక్షమైన అర్థం ఏమిటంటే పవన్ కళ్యాణ్ తో పొత్తు కుదరదు అని ఒక అర్థం. మరొక అర్థం ఏమిటంటే పవన్ కళ్యాణ్ పై వ్యతిరేకత చూపించడం. పవన్ కళ్యాణ్ తో పొత్తు కలుపుకొని ముందుకు వెళ్లాలని తెలుగుదేశానికి కూడా ఉంది. కానీ మొన్న ప్రచారంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు టిడిపి వాళ్ళు ఇలా చేస్తున్నారు.