రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ అంధకారం అవుతుంది అని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ విభజన బిల్లు సందర్భగా అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు తెలంగాణలో కోతలు లేని విద్యుత్తు సరఫరా జరుగుతుండగా.. ఆంధ్రాలో కరెంట్ కోతలతో ప్రజలు సతమతమవుతున్నారు అని తెలంగాణ మంత్రులు ఎద్దేవా చేస్తున్నారు. అయితే భారీగా పెరిగిన కరెంట్ ఛార్జీలు, విద్యుత్తు కోతలు ఏపీ సీఎం జగన్ కు ప్రతికూలంగా మారాయనే చెప్పవచ్చు.  


వీటితో పాటు రోడ్ల సమస్యలు.  రహదారి నిర్మాణాలు ఎన్ని చేపట్టినా గుంతలను పూడ్చటం లేదని అటు ప్రజలు, ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ రెండు నిత్యం సామాన్యులపై నేరుగా ప్రభావం చూపే అంశాలు. సొంత పార్టీ నేతలే కార్యకర్తలను వేధిస్తున్నారు అని దీనిని నియంత్రించడం లేదని పార్టీ పెద్దలే వాపోతున్నారు.


గతంలో వైసీపీ సోషల్ మీడియా విభాగంలో స్వచ్ఛందంగా పనిచేసిన వారు దాదాపు 50-60శాతం మంది టీడీపీ తరఫున జీతం తీసుకొని ప్రచారం చేసేందుకు వెళ్లిపోయారు.  ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నా 50 శాతం మంది ఉద్యోగులుతోనే సోషల్ మీడియాను నడిపిస్తున్నారు.  ఈ విషయంలో టీడీపీ కొంత దూకుడుగానే ఉంది.


ఇంకొక అంశం ప్రభుత్వ ఉద్యోగులు. వారికి బదిలీలు, పదోన్నతులు ఇచ్చినా మళ్లీ సీఎంగా చంద్రబాబు వస్తేనే మనం ప్రశాంతంగా ఉండవచ్చు అనే భావన ఏర్పడిందనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అడిగినవన్నీ ఇవ్వాలి. లేకుంటే వారిలో అసంతృప్తి మొదలవుతుంది. గతంలో చంద్రబాబు అలాంటి వాటిని ప్రోత్సహించేవారు కాదు. 2104-19మధ్య కాలంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మళ్లీ చంద్రబాబు వస్తే ఆ తరహా స్వేచ్ఛ వస్తోందని వారు భావిస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్టు. ఈ అరెస్టు తర్వాత వరుస పెట్టి ప్రభుత్వం అతనిపై కేసులు పెడుతుండటంతో ప్రతీకార రాజకీయాలకు పాల్పడి వేధిస్తున్నారు అని ప్రజల్లోకి వెళ్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది లాభమా.. నష్టామా అంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: