1925 తర్వాత భారత రక్షణ రంగాన్ని పట్టించుకున్న ప్రధానులు చాలా తక్కువగా ఉన్నారు. ఎప్పటివో పురాతన కాలం నాటి ఆయుధ సామగ్రితో ఎన్నికలకు సన్నద్ధం అయ్యేవారు. మోదీ ప్రధాని అయిన తర్వాత పుల్వామా, పటాన్ కోట దాడులు జరిగాయి. ఆ సమయంలో పాకిస్థాన్ పై యుద్ధం చేయాడానికి సన్నద్ధత చూసుకుంటే మన దగ్గర సరిపడిన ఆయుధాలు కానీ.. యుద్ధ ట్యాంకులు కానీ లేవని తెలిసింది. మరోవైపు పాకిస్థాన్ కు చైనా మద్దతు ఉంది.


దీంతో అప్పటి నుంచి ఆయుధాల కొనుగోలు, తయారీపై మోదీ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే రాఫెల్ యుద్ధ విమానాలు ఒప్పందం వంటివి జరిగాయి. కానీ ఇప్పుడు స్వదేశీ పరిజ్ఙానంతో యుద్ధ విమానాలు తయారు చేయగలిగే స్థాయికి వెళ్లారు. ఇది ఓ రకంగా చెప్పాలంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఘనతే.


ఇప్పుడు తాజాగా మరో కొత్త డీల్ కు కేంద్రం పచ్చజెండా ఊపింది. భారత సైన్యం కొసం భారీగా యుద్ధ విమానాలు, ఇతర అవసరమైన తేలిక పాటి విమానాలు, వాహనాలకు రక్షణ శాఖ కొనుగోలు చేయనుంది.  శత్రువుల మదిలో మరింత భయాన్ని పెంచేందుకు భారత సైన్యాన్ని పటిష్ఠం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2.23లక్షల కోట్ల విలువైన తేజస్ యుద్ధ విమానాలు, ప్రచండ్ హెలికాఫ్టర్ లు కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.


భారత సాయుధ బలగాల కోసం 97 తేజస్ తేలికపాటి యుద్ధవిమానాలు, 156 ప్రచండ్ హెలికాఫ్టర్లు కొనుగోలు చేయనుంది. దీంతో పాటు వాయుసేనకు చెందిన సుఖోయ్ -30 యుద్ధ విమానాలను అప్ గ్రేడ్ చేసేందుకు కూడా ఆమోదం తెలిపింది. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ రెండు రకాల విమానాలను స్వదేశీ పరిజ్ఙానంతో అభివృద్ధి పరుస్తున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది. తాజా నిర్ణయాలతో భారత్ శత్రు దేశాలైన పాకిస్థాన్, చైనాలకు గట్టి హెచ్చరిక పంపినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: