ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలకు మిచౌంగ్ తుపాన్ తీరని నష్టం చేసింది. మూడు రోజుల పాటు కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పంట నీట మునిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలతో అంతంతమాత్రంగా ఉన్న రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయి.  అయితే ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం  అవుతున్నాయి.


గతంలో చంద్రబాబు, ప్రస్తుత జగన్ పాలనకు ముడి పెడుతూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఏపీ సీఎం జగన్ ప్రకృతి విపత్తులు వచ్చిన సమయంలో చాలా నింపాదిగా వ్యవహరిస్తారు. మూడేళ్ల  క్రితం కడప జిల్లాలో అన్నమయ్య  ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పుడు ఆయన చాలా ఆలస్యంగా అక్కడ పర్యటించారు. తాను అక్కడికి వెళ్తే పనులకు ఆటంకం కలుగుతుంది అని అధికారులు తనతో ఉంటే పనులు ఎవరు చేస్తారని ఆయన అంటుంటారు. సీఎం పర్యవేక్షణ చేస్తుంటే మిగతా అధికారులు చురుగ్గా పనిచేస్తారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


మరోవైపు టీడీపీ హయాంలో ఎలాంటి విపత్తు జరిగినా చంద్రబాబు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేసి సహాయక చర్యలు చేపట్టేవారిని గుర్తు చేసుకుంటున్నారు.  వీటిపై ఎవరి వాదనలు వారికి ఉన్నాయి.  హుదూద్, తిత్లీ లాంటి తుపానుల సమయంలో చంద్రబాబు అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించేవారు. అక్కడ సహాయక చర్యలు జరుగుతుండగా వెళ్లి పరిశీలించడం.. ఏదైనా చేస్తున్నట్లు ఫొటోకి ఫోజులు ఇవ్వడం లాంటివి చేసేవారు. ఇది చంద్రబాబు స్టైల్.


జగన్ మోహన్ రెడ్డి విధానం ఏంటంటే ప్రకృతి వైపరిత్యాలు జరిగిన సమయంలో ముందు వాలంటీర్లు, ఉద్యోగులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టాలి. వారికి ముందు రక్షణ చ ర్యలు చేయాలి. పోలీస్ యంత్రాoగం, సహాయ విపత్తు బృందాలు వీళ్లంతా పనిచేసి ముందు ఆసమస్యను తీర్చాలి. అంతా అయిపోయిన తర్వాత శిబిరాల నుంచి వెళ్లేటప్పుడు డబ్బులు అందజేసిన తర్వాత.. సక్రమంగా పనులు  జరిగాయా లేదా అనేది చూసేందుకు వెళ్లడం  జగన్ మోహన్ రెడ్డి విధానం.  వీళ్ల ఇద్దరిలో ఎవరి విధానం మంచిదో ప్రజలే నిర్ణయించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: