
తీరా కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ఇది చంద్రబాబు ఇచ్చిన రిటన్ గిఫ్ట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియాక.. ఫామ్ హౌస్ వేదికగా కేటీఆర్, హరీశ్ రావుల మధ్య కొట్లాట కేసీఆర్ అనారోగ్యానికి దారి తీసిందనే వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి.
2014 ఎన్నికల తర్వాత అవశేష ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. అయితే జగన్ కు కేసీఆర్ సహకారం అందిస్తున్నారని చంద్రబాబు అనుమానించారు. అందుకే కేసీఆర్ పై గురి పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలని భావించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు. దీంతో కేసీఆర్ పగబట్టినట్లు తెలంగాణలో టీడీపీని ఉనికిలో లేకుండా చేశారు.
అయితే బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలని చూస్తున్న టీడీపీ నేతలు సోషల్ మీడియాలో విచిత్ర ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో ఓటమికి కేటీఆర్ ప్రధాన కారణమని హరీశ్ ఆరోపించినట్లు… చంద్రబాబుపై ప్రతి కూల వ్యాఖ్యలే పార్టీ విజయంపై తీవ్ర ప్రభావం చూపాయని.. ఆ విషయంలో తప్పంతా కేటీఆర్ దే అని హరీశ్ రావు తేల్చారు. దీనికి బదులుగా కేటీఆర్ 21మంది ఎమ్మెల్యేలతో హరీశ్ రావు వర్గాన్ని రూపొందించుకున్నారని కేసీఆర్ సాక్షిగా వాదనలు జరిగాయి అని ఈ క్రమంలోనే కేసీఆర్ కు గాయాలైనట్లు రాసుకొచ్చారు. ఇలాంటి రాతలను బీఆర్ఎస్ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.