రాజకీయ నాయకులకు అధికారమే పరమావధి. ప్రస్తుతం జగన్ చాలా చోట్ల సిట్టింగ్ లను మార్చతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఐ ప్యాక్ టీం సర్వే ప్రకారమే టికెట్లు ఇస్తానని జగన్ పలు సందర్భాల్లో తేల్చి చెప్పారు. అయితే టికెట్లు ఇవ్వని నేతలంతా పార్టీ మారుతారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తెలంగాణతో పోల్చితే ఏపీలో రెండే ప్రధాన పార్టీలు.
అదే తెలంగాణలో అయితే వారికి బోలెడు అవకాశాలు ఉన్నాయి. ఏపీలో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. సీట్ల కేటాయింపులో ఎవరికీ ఎక్కడ సీట్లు వస్తాయో ఆ పార్టీ నాయకులకే నమ్మకం లేదు. మరోవైపు బీజేపీ కూడా ఇందులో కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ నాయకులు టీడీపీలోకి వెళ్లడం వల్ల ఉపయోగం లేదని వారు భావించొచ్చు.
తాజా పరిస్థితులు చూసుకుంటే ఏపీలో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం. వైసీపీ నాయకులు టీడీపీలోకి వస్తే ఈ పార్టీ నేతలు పార్టీ ఫిరాయించే అవకాశం ఉంటుంది. ఒకవేళ పార్టీ మారే అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటే జగన్ ఎందుకు వదులుకుంటారు. అతనికి ఎమ్మెల్యే అవకాశం ఇస్తారు. ఒకవేళ తప్పుడు అంచనాతో అభ్యర్థులను వదులుకుంటే అది జగన్ కు భారీ నష్టమే చేకూర్చుతుంది. కాబట్టి వైసీపీని ముంచినా.. తేల్చినా అది మొత్తం ఐప్యాక్ పైనే ఆధారపడి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి