సీ డాక్ .. అంటే సెంటర్ ఫర్ డెవలప్‌ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్.. కేంద్ర ప్రభుత్వ సంస్థ.. సీడ్యాక్ లో ప్రాజెక్ట్ స్టాఫ్ నోయిడా (యూపీ)లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్అడ్వాన్స్ కంప్యూటింగ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

 

ఈ ఉద్యోగాలకు నేరుగా వాకిన్ ఇంటర్వ్యూలకు వెళ్లవచ్చు. మొత్తం ఖాళీలు 102 పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు ఉంటాయి. బిజినెస్ డెవలప్మెంట్, సర్వర్ అడ్మిన్, ఎంబడెడ్ సాఫ్ట్ వేర్ సిస్టమ్స్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

 

 

ఈ ఉద్యోగాలు పొందాలంటే.. సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎంటెక్/ ఎంఈ/ పీహెచ్ డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిసెంబరు 19-21 తేదీల మధ్య .నోయిడాలోని సీడ్యాక్ కార్యాలయానికి నేరుగా వెళ్లవచ్చు. చిరునామా.. సీడ్యాక్, అనుసంధాన్ భవన్, ఇన్‌స్టిట్యూషన్ ఏరియా, సెక్టర్, నోయిడా-201307. మరిన్ని వివరాల కోసం
వెబ్ సైట్: https://www.cdac.in/ ను చూడవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: