నిరుద్యోగులకు ఒక శుభవార్త.. భార‌త ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనేజేష‌న్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్సన‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) వివిధ విభాగాల్లో మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  ఈ పోస్టులకు పదోతరగతి లేదా ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు అని డీఆర్‌డీఓ తెలియచేసింది.

 

ఇక  నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుందామా మరి...

ఇక మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ పోస్టుల వివరాలు ఇలా...
మొత్తం ఖాళీల సంఖ్య: 1817
వివిధ పోస్టులకు సంబంధిత వివరాలు ఇలా...

జనరల్-849
 ఓబీసీ-503
 ఈడబ్ల్యూఎస్-188
 ఎస్సీ-163
 ఎస్టీ-11 

 

ఇక అర్హత విషయానికి వస్తే  ప‌దోత‌ర‌గ‌తి లేదా ఐటీఐ అర్హత కలిగి కచ్చితంగా ఉండాలి. ఇక అభ్యర్థుల వయసు మాత్రం  23.01.2020 నాటికి 18 - 25 సంవత్సరాల మ‌ధ్య కచ్చితంగా ఉండాలి. ఇక సరైన అర్హతలు, ఆసక్తి  ఉన్నవారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇక అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఇక మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు సడలింపు చేసే అవకాశం కూడా ఉంది. 

 

ఇక ఎంపిక మాత్రం టైర్‌-1(స్క్రీనింగ్), టైర్‌-2 (ఫైనల్) ఆన్‌లైన్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18 వేల నుంచి రూ.56 వేల వరకు జీతం అందిస్తుంది డీఆర్‌డీఓ. వీరికి జీతంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను కూడా ఇస్తుంది. ఇక దేశవ్యాప్తంగా పరీక్షలు  పలు ప్రధాన నగరాల్లో నియామక పరీక్షలు నిర్వహించ బోతున్నారు. ఇక మన  తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పరీక్షల కేంద్రాలు అని చెప్పవచ్చు.

 

ముఖ్యమైన తేదీల వివరాలు ఇలా 

ఆన్‌లైన్లో  దరఖాస్తు చేసుకోవడానికి  ప్రక్రియ ప్రారంభం: 23.12.2019.
ఆన్‌లైన్లో  దరఖాస్తు చేసుకోవడానికి చివ‌రితేది: 23.01.2020.

 

మరింత సమాచారం తెలుసుకోండి: