హైదరాబాద్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లోని ప్రముఖ సంస్థ ల్లో ఉద్యోగాలను భర్తీ చేసెందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ మేరకు వరుస నోటిఫికెషన్ లను విడుదల చేస్తున్నారు.. హైదరాబాద్‌ లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఆర్‌డీఓకు చెందిన ల్యాబ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబరేటరీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జూనియర్ రీసెర్చ్ విభాగంలో పోస్టుల్ని భర్తీ చేస్తోంది.


మొత్తం 10 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూన్ 14 చివరి తేదీ. దరఖాస్తుల్ని చివరి తేదీలోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌ లో చూడవచ్చు..


ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు..


జూనియర్ రీసెర్చ్ ఫెలో మొత్తం ఖాళీలు- 10
మెకానికల్ ఇంజనీరింగ్- 7
ఏరోనాటికల్ లేదా ఏరో స్పేస్ ఇంజనీరింగ్- 3


గమనించాల్సిన విషయాలు.. 


దరఖాస్తు ప్రారంభం- 2021 మే 22
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 14
విద్యార్హతలు- జేఆర్ఎఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టుకు మెకానికల్ ఇంజనీరింగ్‌ లో బీఈ లేదా బీటెక్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. గేట్ స్కోర్ తప్పనిసరి. జేఆర్ఎఫ్ ఏరోనాటికల్ లేదా ఏరో స్పేస్ ఇంజనీరింగ్ పోస్టుకు ఆ బ్రాంచ్‌లో బీఈ లేదా బీటెక్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. గేట్ స్కోర్ తప్పనిసరి.
వయస్సు- 28 ఏళ్లు
వేతనం- రూ.31,000 + హెచ్ఆర్ఏ


https://www.drdo.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
అందులో కెరీర్స్‌ సెక్షన్‌ లో నోటిఫికేషన్ ఉంటుంది.
నోటిఫికేషన్‌ లోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది.
దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేయాలి.
అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి దరఖాస్తు ఫామ్‌ను పోస్టు లో పంపాలి.


ఇకపోతే దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.. అప్పుడే అవగాహన వస్తుందని అధికారులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: