విటమిన్ డి లోపం అంటూ ఉంటాం. కానీ అసలు అది ఏర్పడడానికి కారణం చాలా మందికి తెలియదు.ప్రతి వ్యక్తి శరీరంలో కోలి కాల్సి ఫెరాల్‌ అనే ఆసిడ్ ఒకటి ఉంటుంది. అది లోపిస్తే చాలా సమస్యల బారినపడతాం. విటమిన్ డి.. దీన్నే సన్‌షైన్ విటమిన్ అని అంటారు. సూర్యకాంతిలో రోజూ కొంత సేపు ఉంటే ఈ విటమిన్ మనకు లభిస్తుంది. ఇప్పుడు చాలా మందిలో విటమిన్‌-డి లోపం కనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. వారిలో విటమిన్‌-డి లోపం పెద్ద సమస్యగా మారుతోంది. బయటకు వెళ్ళి ఆటలు ఆడటం తగ్గిపోయాక ఈ సమస్య మరింత పెరిగింది.

 

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు శ‌రీరంలో విట‌మిన్ డి వ‌ల్ల ఎదుర‌య్యే లోపాలే చాలా మందికి తెలుసు. కాని, శ‌రీరంలో విట‌మిట్ డి ఎక్కువైనా ముప్పే అని తెలుసా..? అవును మీరు విన్న‌ది నిజ‌మే. చాలా మంది ఓరల్ సిరప్స్ రూపంలోనూ, టాబ్లెట్స్ రూపంలో విటమన్ డీ పొందుతున్నారు. అయితే విటమిన్ - డి..అతిగా తీసుకుంటే మాత్రం కిడ్నీలకు ప్రమాదమని ఓ ప‌రిశోధ‌న‌లో తేలింది. వాస్త‌వానికి సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి మనకు సహజంగానే లభిస్తుంది.

 

అలాగే సమతుల ఆహారం, పప్పుదినుసులు, కూరగాయాలు విరివిగా తీసుకుంటే సరిపోతుంది. అయితే కొంద‌రు డాక్ట‌ర్ల సూచ‌న లేకుండా మెడిసెన్స్ రూపంలో విజ‌మిన్‌-డి ని పొందుతారు. అలా తెలియ‌కుండా ఒక్కోసారి అధిక‌మొత్తంలో విట‌మిన్-డి తీసుకుంటే కిడ్నీలు చెడిపోతాయి. మ‌రియు అధిక రక్తపోటు, అలసట, రక్తంలో క్యాల్షియం పెరగడంవికారం, వాంతులు, ఆకలి మందగించడం, తరచూ మూత్ర విసర్జన ఇలా చివ‌ర‌కు కిడ్నీ సమస్యలకు దారితీస్తాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: