విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి చాలా చాలా అవసరం. విటమిన్ సీ ఇమ్యూనిటీకీ, విటమిన్ డీ ఎముకలు బలంగా ఉండడానికీ, విటమిన్ ఏ కంటి చూపుకి ఇలా విటమిన్లు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. అలాగే విటమిన్లలో మరొక ముఖ్యమైన విటమిన్ కే గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది కూడా విటమిన్ ఏ లాగానే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. విటమిన్ కే మనకి చేసే మేలు ఏమిటో చూద్దాం.

 ప్రయోజనాలు :

1. బోన్ హెల్త్ కి హెల్ప్ చేస్తుంది.

2. బ్లడ్ క్లాటింగ్ అవసరమైన ప్రోటీన్ ని సమకూరుస్తుంది.


3. గుండెని ప్రొటెక్ట్ చేస్తుంది.


4. ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది.


5. బ్లడ్ కాల్షియం లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది.


6. డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది. 





విటమిన్ లోపిస్తే కలిగే నష్టాలు :

1. ఏదైనా గాయమైనప్పుడు రక్తస్రావం తొందరగా ఆగదు. చిన్న దెబ్బలకి కూడా ఎక్కువ రక్తం పోతుంది.

2. విటమిన్ కే చాలినంత లేకపోతే రక్తహీనత లేదా అనీమియా ఏర్పడవచ్చు. అనీమియా వల్ల నీరసం గా, ఓపిక లేకుండా ఉంటారు.


3. కడుపు నొప్పి కి కూడా విటమిన్ కే డెఫిషియెన్సీ కారణం కావచ్చు.

4. ముక్కులో నుండి రక్తం కారడం కూడా విటమిన్ కే సరిపోయినంత లేదనడానికి సూచనగా భావించవచ్చు.




లభించే ఆహార పదార్థాలు :

1. పాల కూర
2. కాలే
3. బ్రకోలి
4. లెట్యూస్
5. ఫిష్
6. కాలీ ఫ్లవర్
7. ఎగ్స్
8. బ్రస్సెల్ స్ప్రౌట్స్


మరింత సమాచారం తెలుసుకోండి: