అంజీర పండ్లతో ఆరోగ్యంగా ఉంటారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు పండ్లు తింటే ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు నిపుణులు. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే
అంజీర పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
అంజీర పండ్లు
డ్రై ఫ్రూట్ గా మరియు పండుగలా
మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి బరువు తగ్గలనుకున్న వారు తింటే మేలు జరుగుతుంది. ఈ పండులో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ మెరుగు పడటానికి ఎంతో ఉపయోగపడుతుంది. పెక్టిన్ వ్యర్థ
కొలెస్ట్రాల్ ను శరీరం నుండి భయటకు పంపడానికి ఉపయోగపడుతుంది. ఈ పండులో ఫైనల్, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి
గుండె సహజమైన
గుండె బూస్టర్స్ అని చెప్పొచ్చు. అంజీరలో
విటమిన్ కె మరియు యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి వ్యాధి నిరోధకతను పెంచడానికి ఉపయోగపడతాయి. ఈ పండు తినటం వల్ల జ్ఞాపక శక్తిని కూడా మెరుగు పడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ రొమ్ము
క్యాన్సర్ కు నిరోధకంగా పనిచేస్తుంది. ఋతు క్రమం ఆగిపోయిన మహిళలపై అధ్యయనం చేయగా అంజీరా పండు తిన్నవారిలో రొమ్ము
క్యాన్సర్ 34 శాతం
క్యాన్సర్ ప్రమాదం తగ్గింది. పిల్లలు లేనివాళ్లు
అంజీర పండ్లు తినాలి ఈ పండ్లలో ఉండే మెగ్నీషియం, మాంగనీస్ , జింక్ ఖనిజాలు సంతాన సాఫల్యతను పెంచడానికి ఉపయోగపడతాయి. చిన్నప్పట్నించి కూడా
అంజీర పెట్టడం వల్ల పిల్లలకు రక్త హీనత సమస్య రాకుండా కూడా కాపాడుకోవచ్చు. పొటాషియం సోడియం అధికంగా ఉండటం వల్ల ఈ పండు తింటే రక్తపోటు సమస్యకు
చెక్ పెట్టవచ్చు. కాబట్టి ఈ పండును
డ్రై ఫ్రూట్ గా తీసుకున్నా..లేదంటే
పండు తిన్నా మంచి ఫలితాలు ఉంటాయి.