
డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ లో ముఖ్యమైనది అంజీర పండు. ఈ పండు ఎండ పెట్టుకొని కూడా తినవచ్చును. నానబెట్టి తినడం వలన ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.
అంజీర పండు లో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు విటమిన్ బి 6 పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి బాగా అందుతాయి. అందుకే అంజీర పండ్లను తినడం మంచిది.
రాత్రి నానబెట్టి ఉదయం పరగడుపున తినడం వల్ల మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే సమస్యలకు మంచి మందులా పని చేస్తాయి.
పండ్లు తినడం వల్ల లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయి. అంతేకాకుండా అధిక రక్తస్రావంతో బాధపడే వారికి మంచి ఔషధంలా పనిచేస్తుంది.
రక్తహీనతతో బాధపడే వాళ్ళు అంజీర పండ్లు, ఉసిరి పొడితో కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.
పొడి దగ్గు, గొంతు నొప్పితో బాధపడే వాళ్ళు అంజీర ఆకులను బాగా మరిగించి చల్లారిన తర్వాత తాగడం వల్ల దగ్గు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
అంజీర పండ్లలో పేఫ్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో వి6 విటమిన్ కూడా ఉంటుంది. ఇది అల్జీమర్ రాకుండా కాపాడుతుంది.
అంజీర పండు లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకొనే వారు రోజు 2 అంజీర పండ్లు తినడం మంచిది. అలా అని ఎక్కువగా తినకూడదు.