చాలామంది నిద్రలేమితో బాధపడుతుంటారు. కారణం మారుతున్న జీవన విధానంలో మార్పులు, ఆహార పద్ధతులు కూడా కారణమవుతున్నాయి. వీటివల్ల కంటినిండా నిద్ర లేక అనేక సమస్యలు వస్తున్నాయి. మనం  తీసుకునే ఆహారం కూడా నిద్ర పై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి కంటి నిండా నిద్రపోవడానికి ఆహారం తీసుకోవాలో అవి ఎలా పనిచేస్తాయో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 ఓట్స్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కంటినిండా నిద్ర పడుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఓట్స్ లో విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్, మెలటోనిన్ అధికంగా  ఉండటం వల్ల మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫలితంగా నిద్ర బాగా పడుతుంది.

 నిద్రలేమితో బాధపడుతున్న వాళ్లు రాత్రి పడుకోబోయే ముందు బాదము  తినడంవల్ల నిద్ర హాయిగా పడుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే మెగ్నీషియం నిద్ర పట్టేలా చేస్తుంది.

 నిద్ర హాయిగా పట్టడానికి అరటి పండు కూడా కీలక పాత్ర వహిస్తుంది. ఈ పండులో  మెగ్నీషియం, మెలటోనిన్ అనే పదార్థాలు ఉండటం వల్ల నిద్రకు ఉపక్రమించడానికి పనిచేస్తాయి.

 వాల్ నట్స్ తీసుకోవడం వల్ల మెదడును చురుగ్గా పని చేసేటట్లు చేస్తాయి. ఇందులో ఉండే మెలటోనిన్ నిద్ర పట్టడానికి సహాయపడుతుంది.

 రాత్రి నిద్రపోయే ముందు చెర్రీ పండ్లు తినడం వల్ల నిద్ర  బాగా పడుతుందని నిపుణులు  తెలియజేస్తున్నారు.  అందుకే నిద్రలేమితో బాధపడేవారు ఈ రోజు రాత్రి పడుకోబోయే ముందు చెర్రీ పండ్లు తీసుకోవడం మంచిది.

 రోజు గుడ్డు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా గుడ్డులో ఉండే అమైనో యాసిడ్స్ నిద్ర పట్టడానికి ఒక పాత్ర పోషిస్తుంది.

 పాలు కూడా నిద్రలేమి సమస్యను నిర్మూలిస్తాయి. రాత్రి పడుకోబోయే ముందు  ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. పాలు లో  ఉండే పోషకాలు ఆరోగ్యంగా  నిద్రపోవడానికి సహాయపడతాయి.

 రాత్రి నిద్రపోయే ముందు కూల్ డ్రింక్స్,  కాఫీ, టీ వంటివి తీసుకోకపోవడం మంచిది. ఇవి నిద్ర రానీకుండా చేస్తాయి. అలాగే కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల మనం సరిగా కాకపోవడం వల్ల నిద్ర పట్టకుండా ఉంటుంది. అలాంటి ఆహారాలను తీసుకోకపోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: