మన భారతదేశంలో కలప మొక్కలు ఎక్కువగానే పెరుగుతుంటాయి. అలాంటి మొక్కలలో అర్జున వృక్షం (తెల్ల మద్ది) అనేది కూడా ఒక కలప చెట్టు అని చెప్పవచ్చు. ఈ చెట్టు ఆయుర్వేదం లో ఔషధంగా ఎక్కువగా ఉపయోగిస్తారట. ఇది తెలుపు, ఎరుపు రంగులో ఉంటుంది. ఈ అర్జున మొక్క సంజీవని అని కూడా చెప్పవచ్చు . ఆరోగ్యాన్ని ప్రసాదించడం లో మొదటి పాత్ర వహిస్తుంది . అలాగే గుండె జబ్బులు, ఆస్తమా ఉన్న వారికి, ఎముకలు విరిగిన వారికి ఎంతగానో మేలు చేస్తుందని ఔషధ నిపుణులు చెబుతున్నారు.
1).అర్జున వృక్షం బెరడును పాలలో వేసి బాగా మరిగించి, కషాయం లా చేసుకోవాలి. అలా చేసుకున్న దానిని ఉదయాన్నే పరగడుపున తాగితే, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
2). అర్జున వృక్షం బెరడును మెత్తగా నూరి చూర్ణంగా చేసుకొని దాన్ని పాయసంలో కలిపి తీసుకుంటే ఆస్తమా తగ్గిపోతుంది.
3). ఈ వృక్షం బెరడును పొడిగా చేసుకొని తేనెలో కలిపి ఉదయం,సాయంత్రం తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
4). అర్జున బెరడు చూర్ణాన్ని తేనెలో బాగా కలిపి ముఖానికి పట్టించుకుంటే,మొటిమలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా ముఖం కాంతివంతంగా మారుతుంది.
5).ఈ చెట్టు యొక్క బెరడును కషాయం చేసుకుని తాగితే, కాలిన గాయాలు, పుండ్లు తగ్గిపోతాయి.
6). అర్జున మొక్క బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే పురుషుల్లో వీర్యం బాగా అభివృద్ధి చెందుతుంది.
7). అర్జున చెట్టు బెరడును నూరి గంధం లా తీసి, దానిని ఏదైనా గడ్డలు ఉన్నచోట రాసి పైన కట్టాలి. అలా కట్టడం చేత ఆ గడ్డ క్రమంగా తగ్గుతూ వస్తుంది.
ఇలా ఎన్నో అద్భుత గుణాలు కలిగిన అర్జున మొక్క మన ఆరోగ్యాన్ని పదిలం చేస్తుంది. అంతేకాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి వీలైతే మీకు ఈ మొక్క దొరికితే భద్రంగా దాచుకొని, మీ పెరట్లో పెంచుకోవచ్చు. అలాగే దీని వల్ల కలిగే లాభాలను కూడా పొందవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి