పూర్వకాలంలో  ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్లు ఉండేది కావు. కనుక ఆహార పదార్థాలను బయటనే పులియబెడుతూ సంరక్షించుకునే వారు. ఈ ప్రక్రియ ద్వారా ఎంతో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా,శిలీంధ్రాలు ఆహారపదార్ధాలను ఆల్కహాల్ గా మార్చేవి. ఈ విధంగా చేయడం వల్ల ఆహారము పులుపు రుచిని కలిగి ఉండడంతో పాటు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందించేవి. కానీ ప్రస్తుత కాలంలో రిఫ్రిజిరేటర్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరు బయట ఆహార పదార్థాలను వుంచడం లేదు. అందుకోసమే వైద్యులు ప్రతి రోజు తప్పకుండా పులియబెట్టిన ఆహారపదార్థాలను తీసుకోవాలంటూ సూచిస్తుంటారు. అసలు ఏ ఆహారం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి  చూద్దాం.


1). పులియబెట్టిన ఆహారపదార్థాలలో ఉండే ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా మన శరీరంలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్ ను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. దీని వలన రక్తంలో పీహెచ్ విలువ స్థాయిలను నియంత్రించడానికి సహకరిస్తాయి.

2). ప్రతిరోజు పులియబెట్టిన ఆహారపదార్థాలను తీసుకోవడం వలన ఉబ్బసం, డయాబెటిస్, అలర్జీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.

3). ఈ ఆహారం తీసుకోవడం వలన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు ఎంతో సహాయపడుతుంది.

4). పులియబెట్టిన ఆహారపదార్థాలలో విటమిన్లు, మినరల్స్ మన శరీరానికి శక్తిని అందిస్తాయి.

5). పులియబెట్టిన ఆహారాల్లో ల్యాక్టోస్ లను ఉత్పత్తి చేసే ఎంజైములు ఉంటాయి. ఇవి అధిక బరువును తగ్గించడానికి ఎంతో దోహదపడతాయి.

6). పులియబెట్టిన ఆహారపదార్థాలను లో ఒమేగా 3, విటమిన్ బి12 పుష్కలంగా లభిస్థాయి. ఈ పదార్థాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడానికి ఎంతో సహాయ పడతాయి.

పులియబెట్టిన ఆహారపదార్థాలు ఏంటంటే ..పెరుగు, పన్నీరు, ఇడ్లీ, దోశ వంటివి పులియబెట్టిన ఆహారపదార్థాల కిందికి వస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల పైన చెప్పిన ప్రయోజనాలన్నీ కలుగుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పదార్థాలు ఏమిటి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: