అల్లం : మనం ప్రతిరోజు ఉదయాన్నే లేసి అల్లం ఉన్న వస్తువులను తీసుకుని చాలా మంచిది. మనం అల్లం వేసిన టీ తాగితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అలాగే అల్లం లో ఉన్నటువంటి యాంటి ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మనకు అనారోగ్య సమస్యలు రాకుండా అరికడతాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు మరియు గొంతు నొప్పి సమస్య లాంటివి సమస్యలను అవలీలగా తరిమికొట్టే శక్తి అల్లానికి ఉంది.
రెగ్యులర్గా బఠాణీ తినాలి : మనం ప్రతిరోజు బఠాని గింజలను తిన్నట్లయితే మనకు ఎంతో ఆరోగ్యం లభిస్తుంది. ఈ బఠానీ గింజల లో ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చాలా వరకు మనకు లభిస్తాయి. అలాగే ముఖ్యంగా మనకు గ్యాస్ సమస్య రాకుండా అరికడుతుంది ఈ బటనీ. అంతే కాకుండా అజీర్తి సమస్యలను కూడా మన దరికి చేరకుండా చూస్తుంది. కాబట్టి మనం నిత్యం ఈ బటనీని తినే ప్రయత్నం చేయాలి.
విటమిన్ సి : ఈ కాలంలోనైనా విటమిన్ సి ఉండే పండ్లను మరియు కూరగాయలను తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ద్రాక్ష కమల పండ్లు మరియు నిమ్మ లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్ సి ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవడం కారణంగా మన శరీరంలో... రోగ నిరోధక శక్తి మనం పెంపొందించుకో గలుగుతాము. కాబట్టి మనం నిత్యం మన డైలీ షెడ్యూల్ ప్రకారం విటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే తీసుకునే ప్రయత్నం చేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుందనీ వైద్య నిపుణులు తేల్చి చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి