కొంతమందికి అన్నం తిన్నాక పెరుగు తినందే అసలు ముద్ద దిగదు. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తినడం వల్ల శరీరానికి తగినంత కాల్షియం అందుతుంది. ఇందులో ఉండే పోషకాలు ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి6, బి12 తదితర పోషకాలతో జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది.ఇక ప్రోబయోటిక్‌గా ఉండటం వల్ల పెరుగు శరీరాన్ని ఎన్నో రకాల వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఇంకా అలాగే గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. పెరుగు శరీరంలోని pH స్థాయులను బ్యాలెన్స్ చేస్తుంది. భోజనం తర్వాత పెరుగు తినడం వల్ల ఆహారం బాగా జీర్ణమై జీర్ణవ్యవస్థ బలపడుతుంది. పెరుగు దంతాలు, గోర్లు అలాగే ఎముకల ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో కాల్షియం ఉంటుంది. ఇదిలా ఉంటే ఎండాకాలంలో పెరుగు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మరి చలికాలంలో పెరుగు తినడం మంచిదేనా? అంటే ఈ విషయంలో చాలామందికి చాలా అపోహలున్నాయి.


ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల ప్రకారం చలికాలంలో పెరుగు ఎక్కువగా తింటే కఫం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. కఫాన్ని పెంచే గుణాలు పెరుగులో అధికంగా ఉంటాయి. అందుకే చలికాలంలో పెరుగు తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు తదితర శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఇక రాత్రి వేళల్లో అసలు పెరుగు తినకూడదు. ఇక ఇప్పటికే దగ్గు, జలుబు లేదా శ్వాస సమస్యలు ఉంటే, చలికాలంలో పెరుగు తినకపోవడమే మంచిది. అయితే సైన్స్ ప్రకారం, పెరుగు చలికాలంలో కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని కాల్షియం, ఫాస్పరస్, విటమిన్లు వంటి పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదే సమయంలో శ్వాస సమస్యలు ఉంటే, రాత్రిపూట పెరుగు తినకూడదని సైన్స్‌ చెబుతోంది. తింటే మాత్రం ఉబ్బసంలాంటి సమస్యలు వస్తాయి.కాబట్టి పైన చెప్పిన విషయాలు గమనించి పెరుగు మాత్రం చలికాలంలో అస్సలు తినకండి. సంపూర్ణ ఆరోగ్యంగా వుండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: