
తమలపాకుల్లో ఎన్నో రకాల సమస్యలను దూరం చేసే ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం చదివి తెలుసుకుందాం.. తమలపాకులను యాంటీ ఆక్సిడెంట్ల పవర్ హౌస్ అని పిలుస్తారు.. ఇది శరీరంలోని పీహెచ్ స్థాయిని సాధారణంగా ఉంచడమే కాదు కడుపు సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి మంచి ఉపశమనం అని చెప్పవచ్చు. అలాగే మలబద్ధకం సమస్యలో కూడా తమలపాకులు చాలా చక్కగా పనిచేస్తాయి.
ఇకపోతే తమలపాకులు నోటి దుర్వాసన ,దంతాల పసుపు రంగు, దంత క్షయం వంటి సమస్యలను దూరం చేయడమే కాకుండా తమలపాకులతో చేసిన పేస్టుని కొద్ది మొత్తంలో నమిలితే నోటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే ఎవరైనా పంటి నొప్పి, వాపు, నోటి ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే తమలపాకులను నమలాలి అని వైద్యులు సైతం చెబుతున్నారు. దగ్గు, ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు కూడా తమలపాకులను తినడం వల్ల ఉపశమనం కలుగుతుందట. ఇక ఆయుర్వేదంలో కూడా తమలపాకులకు ఒక ప్రత్యేక స్థానం కల్పించబడింది.. ఈ తమలపాకులను నమలడం వల్ల ఒత్తిడి,ఆందోళన వంటి సమస్యలను దూరం చేసుకోవడమే కాదు మానసిక ప్రశాంతత కూడా పొందవచ్చు..