ప్రకృతి ప్రసాదించిన ఆహారాలతోనే మన ఆరోగ్యం ఎంతో మెరుగ్గా ఉంటుందనీ ప్రతి ఒక్కరికి తెలుసు.కానీ నాలుకకు రుచిగా ఉంటుందని ఆ జంక్ ఫుడ్ వెంటపడుతూ,అనవసరమైన రోగాలన్నీ కొనితెచ్చుకుంటూ ఉండటంలో మానవజాతికి మించిన ఏ జాతి లేదని చెప్పవచ్చు.పశువులు,పక్షులు ప్రకృతిలోనే ఆహారాలను తీసుకుంటూ,ఎటువంటి అనారోగ్యము లేక,వాటి జీవితమును అవి హ్యాపీగా జీవిస్తున్నాయి కదా.అలాంటి ఆహారాలను మనము తీసుకుంటే అధిక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అలాంటి వాటిల్లో ఆకుకూరలు చాలా ముఖ్యం.మరి ముఖ్యంగా కొత్తిమీర కొత్తిమీరను రోజు పరగడుపున తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలకుండా తాగుతారనీ ఆహార నిపుణులు చెబుతున్నారు.అవేంటో తెలుసుకుందాం పదండీ..

రోగ నిరోధక శక్తి..

ఎటువంటి జబ్బులైన అడ్డుకోవడానికి మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి.కావున రోజు కొత్తిమీర జ్యూస్ ని పరగడుపున తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ముందుంటుందని చెప్పవచ్చు.

అజీర్తి..

కొత్తిమీరలోని అధిక ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల,అజీర్తి మలబద్ధకం,గ్యాస్ వంటి సమస్యలను తరిమికొడతాయి.అంతేకాక ఆకలిని కూడా అదుపులో ఉంచి,అధిక బరువు తగ్గడానికి కూడా దోహదపడతాయి.

మధుమేహం..

మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి కొత్తిమీర జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇందులోని యాంటీ డయాబెటిక్ గుణాలు రక్తంలోని ఇన్సులిన్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతాయి.

వాపులు తగ్గడానికి..

రోజు పరగడుపున కొత్తిమీర జ్యూస్ తీసుకోవడం వల్ల, ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రక్తం మరియు శరీరంలో వాపుకు గురి చేసే సమ్మేళనాలు నిరోధించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. దీనితో మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు,కీళ్లవాపు వంటి సమస్యలు తగ్గించుకోవచ్చు.

గుండె జబ్బులను తగ్గించుకోవడానికి..

పచ్చి కొత్తిమీర జ్యూస్ రోజూ తీసుకోవడంతో,గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.కొత్తిమీరలోని సుగుణాలు శరీరం నుండి అదనపు సోడియంను తొలగించడంలో సహాయపడతాయి.అంతేకాక ఎల్‌డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ ని కూడా కరిగిస్తుంది.మరియు క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ అడ్డుకోవడంలో కూడా సహాయపడతాయి.కావున ప్రతి ఒక్కరూ పరగడుపున కొత్తిమీర జ్యూస్ తాగడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: