చలికాలం మొదలవగానే దొరికే సీజనల్ ఫ్రూట్స్ లో సీతఫలాలు కూడా ఒకటి.వీటిని చిన్న పెద్దగా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు కూడా.కానీ కొంతమంది చలికాలంలో సీతాఫలం తింటే జలుబు చేస్తుందనే అపోహలో వుంటున్నారు.ఇంకా చెప్పాలి అంటే ఫ్రూట్స్ తింటేనే జలుబు ఎక్కువ అవుతుందని అపోహలు వార్తలు కూడా ఎక్కువ అవుతూఉన్నాయి. ఈ అపోహలను దూరం చేయాలని ఆహారనిపుణులు అవగాహన సదస్సులు కూడా పెడుతున్నారు. సాధారణంగా దగ్గు,జలుబు రావడానికి కారణము వాతావరణంలో ఉన్న పొల్యూషన్,బ్యాక్టీరియా,ఫంగస్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే దగ్గు,జలుబు,జ్వరానికి గురవుతారని చెబుతున్నారు.అసలు సీతాఫలం తింటే కలిగే లాభాలు తెలుస్తే ఈసారి అసలు తినకుండా వదలరు.మరి అవేంటో తెలుసుకుందాం పదండి..

క్యాన్సర్ నివారించడానికి..

ఇందులో అసిటోజెనిన్,ఆల్కలాయిడ్స్ వంటి సమ్మేళనాలు పుష్కళంగా లభిస్తాయి.ఈ పండ్లను రోజుకొకటి చొప్పున క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి.ఈ విషయాన్నీ కొన్ని పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైనది.

రక్తహీనత తగ్గించడానికి..

ఈ పండ్లలో ఐరన్ కంటెంట్ పుష్కళంగా లభిస్తుంది.ఈ కారణంతో వైద్యులు కూడా రక్తహీనతతో బాధపడుతున్న వారికి సీతాఫలాన్ని తినమని సలహా ఇస్తున్నారు.అంతేకాక నిరసాన్ని దూరం చేస్తుంది.

మెదడు కంట్రోలింగ్ కోసం..

ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్ అధికంగా ఉంటుంది.దీని వలన మెదడులోని ప్రెసర్ స్థాయిలను నియంత్రిస్తుంది.అంతే కాక పార్కిన్సన్స్ వంటి క్షీణించిన మెదడు సమస్యల నుంచి కూడా ఈ పండ్లు రక్షిస్తాయి.

జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయడానికి..

ఈ సీజన్లో పొట్ట పనితీరు మందకోడిగా ఉంటుంది.కావున ఈ సమయంలో సీతాఫలం రోజూ తీసుకోవడంతో ఇందులోని పైబర్ కంటెంట్ శరీరంలోని టాక్సిన్స్‌ను ఈజీగా తొలగించడంలో సహాయపడుతుంది.మరియు అసిడిటీ,పొట్టలో పుండ్లు వంటి సమస్యలను దరి చేరనివ్వదు.

బరువు పెరుగడానికి..

దీనిలో శరీరానికి కావాల్సిన కేలరీలు పుష్కలంగా లభిస్తాయి.బరువు పెరగాలని డైట్ పాటించే వారికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు.మరియు జీవక్రియ రేటును పెంచి, దానితో పాటు ఆకలిని పెంచుతుంది.తినమని మారం చేసే పిల్లలకు ఇది ఇస్తే చాలు ఇష్టంగా తింటారు.మరియు వారి కడుపు నిండుతుంది కూడా.

మధుమేహ నివారణకు..

సీతాఫలం మధుమేహాన్ని పెంచుతుందని అపోహలో ఉంటారు.కానీ ఈ పండును రోజుకు ఒకటి తీసుకోవడం వల్ల రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ సమతుల్యత పాటిస్తాయి. కూడా ఇలాంటి అపోహలతో ఉంటే వెంటనే వాటిని పటాపంచలు చేసి,సీతాఫలం తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: