ప్రస్తుత కాలంలో అందరిని బాగా వణికిస్తున్న సమస్య ఫ్యాటి లివర్. ఇది ఈరోజుల్లో భూతం లాగా వ్యాపిస్తుంది. ఈ సమస్య రాకుండా ఉండాలన్నా ఒకవేళ ఈ సమస్య వచ్చినా కూడా అది తగ్గాలన్నా ఖచ్చితంగా చక్కటి డైట్ ని పాటించాలి. ఆ డైట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సమస్య తగ్గాలంటే తినే తిండి విషయంలో ఖచ్చితంగా అదుపు ఉండాలి. ప్రతి రోజూ మధ్యాహ్నం అన్నానికి బదులుగా రెండు పుల్కాలను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో, కాలేయంలో ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంది. ఇలా ఆహారాన్ని తీసుకోవడంతో పాటు రోజూ వ్యాయామం చేయాలి. వాకింగ్, యోగా వంటివి చేయడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. వీటితో పాటు జంక్ ఫుడ్ కు, ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. ఈ విధంగా తగిన ఆహారాన్ని తీసుకుంటూ వ్యాయామం చేయడం వల్ల రెండు నుండి మూడు నెలలో ఫ్యాటీలివర్ సమస్య తగ్గుతుందని కాలేయం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.ఖచ్చితంగా వారంలో ఒకరోజు ఉపవాసం చేయాలి.


నిమ్మరసం, తేనె కలిపిన నీటిని తాగుతూ ఒక రోజంతా ఉపవాసం ఉండాలి. ఇలా ఉండడం వల్ల శరీరానికి కావల్సిన శక్తి అంతా శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు నుండి లభిస్తుంది. దీంతో శరీరంలో ఉన్న కొవ్వు ఎక్కువగా కరుగుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య కూడా తగ్గుతుంది.ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు రోజూ సాయంత్రం 6 గంటల లోపు ఆహారాన్ని తీసుకోవాలి. అది కేవలం పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. పండ్లను తీసుకోవడం వల్ల సూక్ష్మ పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనకు శక్తి తక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. కనుక రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం వరకు మన శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఇలా పండ్లను తీసుకోవడం వల్ల శక్తి తక్కువగా లభిస్తుంది కనుక మన శరీరం శక్తిని నిల్వ ఉన్న కొవ్వు నుండి గ్రహిస్తుంది. దీంతో కాలేయానికి పట్టిన కొవ్వు కూడా కరుగుతుంది.అంతేకాకుండా కాలేయం పూర్తిగా శుభ్రమవుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ డైట్ పాటించండి. సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: