చాలా మందికి జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో మనం ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది.ముఖ్యంగా మన గోర్లలో ఎన్నో రకాల బ్యాక్టీరియాలు కూడా ఉంటాయని వైద్యుల సైతం తెలియజేస్తూ ఉంటారు.. సాధారణంగా మనం రోజు మొత్తంలో చేతులను చాలాసార్లు ఎక్కడెక్కడో తాకుతూ ఉంటాము. ముఖం నుంచి శరీర భాగాలకు వరకు తాకుతూనే ఉంటాము.. అయితే ఇలా అందమైన గోర్ల క్రింద లక్షలాది సూచన క్రిములు కూడా నివసిస్తుంటాయని విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.


ముఖ్యంగా గోర్ల కింద 32 రకాల బ్యాక్టీరియాలో 28 రకాల ఫంగస్ లు వ్యాపింప చేసేటువంటి  ఉంటాయని ఒక పరిశోధనలో తెలియజేశారు. ఈ పరిశోధన 2021లో జరిగింది.. కొంతమంది గోర్ల కింద నుంచి శాంపుల్స్ తీసుకొని పరీక్షించగా అందులో ఇవి బయటపడ్డాయట అయితే ఇందులో 50% నమూనాలు బ్యాక్టీరియా మాత్రమే ఉందని..6.3% ఫంగస్ను కలిగి ఉందని..43.7% బ్యాక్టీరియా ఫంగస్ మిశ్రమాలలోని సైతం కలిగి ఉన్నాయని తెలియజేశారు.ముఖ్యంగా కాలి గోర్లలో కూడా ఈ బ్యాక్టీరియా ఉంటుందని వెల్లడించారు.. అందుకే గోర్లు చేతులు చాలా శుభ్రపరమైనవి గా ఉంచుకోవాలి.


ముఖ్యంగా మనం తినడానికి ముక్కు తుడుచుకోవడానికి లేదా ఎవరైనా కౌగిలించుకోవడానికి మన చేతులను ఉపయోగిస్తాము.. అటువంటి పరిస్థితులలో గోర్లు శుభ్రంగా ఉండాలి.. అయితే పరిశోధకులు తెలుపుతున్న సమాచారం ప్రకారం గొర్ల కింద ఉండే బ్యాక్టీరియా ఫంగస్ వంటివి హాని చేయవని తెలియజేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాలలో ఈ సూక్ష్మక్రియలు చాలా బలహీనమై ఇమ్యూనిటీ పవర్ ఉన్నవారిలో ఏదైనా గాయం లేదా ఇన్ఫెక్షన్ సోకిన వారిలో ఈజీగా ప్రవేశిస్తాయని తెలుపుతున్నారు.. దీనివల్ల గోర్లు రంగు మారడం వాపు చీమునొప్పి వంటివి వస్తాయట.

గోర్లను క్రమం తప్పకుండా కత్తిరిస్తూ ఉండాలి. గోర్ల కింద మురికి పేరుకుపోకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలి.. కనీసం రోజులో రెండు మూడు సార్లు అయినా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: