ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో నిద్రపోవడం విశ్రాంతి తీసుకోవడం అనేది చాలా ముఖ్యము.. కనీసం 8 గంటలు నిద్ర ప్రతి ఒక్కరికి అవసరం. చాలామంది ఈ మధ్య కాలంలో నిద్రలేని సమస్యతో బాధపడుతున్న వారు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నారు. రాత్రివేళ పడుకున్న గంటల తరబడి నిద్ర పట్టకుండా ఉన్నారు. అలా రాత్రి సమయాలలో లేటుగా నిద్ర పట్టి ఉదయం లేవగానే చాలా అలసటగా కనిపిస్తూ ఉంటారు. అయితే చాలా మంది ఇలాంటి విషయాలను కాస్త తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది రోజురోజుకి పెరిగితే ప్రమాదమని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.


ఇలా జరగడం వల్ల నిద్రకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది తీవ్రతగా మారితే కొన్ని సంకేతాలను కూడా ఇస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. నిద్రలేమితో పాటు అనేక రకాల నిద్రకు సంబంధించిన సమస్యలు కూడా ఏర్పడతాయి ఇవి మన శరీరం ఆరోగ్యం పైన కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.


ముఖ్యంగా తక్కువ సేపు నిద్రపోతే నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి దీనివల్ల గుండె జబ్బులు స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉన్నది.


ఇది నిద్రలేని సమస్య ఎక్కువ అయితే జరిగే వింత పరిణామాలలో ప్రవర్తనలో మార్పురావడం మాట్లాడడం రాత్రిపూట కేకలు వేయడం వంటివి చేస్తూ ఉంటారట.


నిద్రలేని సమస్యలు ఎక్కువగా ఏర్పడితే అధికంగా నిద్రపోవడం లేకపోతే పగటిపూట సడన్గా నిద్రపోవడం వంటివి చేస్తూ ఉంటారు. మొదట ఈ లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది అందువల్ల నిద్రకు సంబంధించిన ఎలాంటి సమస్యలనైనా సరే నిర్లక్ష్యం వ్యవహరించకూడదు.


రాత్రిపూట నిద్ర సరిగ్గా లేకపోయినా ఉదయం లేచిన తర్వాత అలసటగా అనిపించిన కచ్చితంగా వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యము. పడుకొనే సమయాన్ని సెట్ చేసుకొని నిద్రపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు. రాను రాను నిద్రలేని సమస్య ఎక్కువైతే చాలా ప్రమాదం ఉంటుందని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: