రొయ్యలు రుచికరమైనవి, పోషక విలువలున్న సముద్రపు ఆహారంగా చాలామందికి ఇష్టమైనవి. వీటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉండటంతో పాటు, విటమిన్లు, ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి. అయితే, రొయ్యలు తినడం వల్ల లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. రొయ్యలు శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ముందుగా, వీటిలో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు చాలా అవసరం.

రొయ్యలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే, మెదడు పనితీరును మెరుగుపరచి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. రొయ్యలలో విటమిన్ B12, విటమిన్ D, సెలీనియం, ఐరన్, జింక్, రాగి, అయోడిన్ వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.

 విటమిన్ B12 రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది, సెలీనియం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయోడిన్ థైరాయిడ్ గ్రంథి పనితీరుకు అవసరం. జింక్ మరియు సెలీనియం శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో కూడా సహాయపడతాయని అంటారు. ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి కూడా రొయ్యలు ఉపయోగపడతాయి.

రొయ్యలు తిన్న తర్వాత దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా తీవ్రమైన అనాఫిలాక్సిస్ వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అలెర్జీ ఉన్నవారు రొయ్యలకు దూరంగా ఉండటం మంచిది. య్యలను ఎప్పుడూ పూర్తిగా ఉడికించి తినాలి. అలాగే, రొయ్యలలో కొలెస్ట్రాల్ ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రొయ్యలలో ఉండే కొలెస్ట్రాల్ శరీరానికి హానికరం కాదు. అయితే, అధికంగా తీసుకోవడం వల్ల కొందరిలో జీర్ణ అసౌకర్యం కలగవచ్చు.


కొన్ని ఆహారాలతో కలిపి రొయ్యలు తినడం కూడా సమస్యలను కలిగిస్తుంది. ఉదాహరణకు, పాలు లేదా పెరుగు వంటి పాల ఉత్పత్తులతో రొయ్యలను కలిపి తీసుకోవడం వల్ల అలెర్జీ ప్రతిచర్యలు లేదా జీర్ణ సమస్యలు రావచ్చని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. పాల ఉత్పత్తులలోని కాల్షియం, రొయ్యలలోని ప్రోటీన్లతో చర్య జరిపి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుందని అంటారు. అలాగే, వేయించిన, మసాలా ఆహారాలతో రొయ్యలను కలిపి తినడం వల్ల కూడా జీర్ణ సమస్యలు, ఉబ్బరం రావచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: