ఈ రోజుల్లో ఒబిసిటీ అనేది  ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. చిన్న వయసులోనే చాలామంది పిల్లలు, యువకులు, యువతులు అధిక బరువుతో బాధపడుతున్నారు. డాక్టర్ల మాటల్లో చెప్పాలంటే, ఇది కేవలం ఒక చిన్న సమస్య కాదు, శరీరానికి మెల్లగా నష్టం చేసే ఒక శాపంలాంటిది. చాలామంది వ్యాయామాలు చేయకపోవడం వల్లే ఒబిసిటీ వస్తోందని అనుకుంటారు. నిజమే, వ్యాయామం చేయని వారు వేగంగా బరువు పెరుగుతారు. అయితే, వ్యాయామాలు చేసి, డైట్ ఫాలో అవుతున్నా కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం చాలామందిలో కనిపించే సమస్య. చిన్న పిల్లల నుంచే పొట్ట పెద్దదిగా కనిపించడం, పెద్దవారిలో పొట్ట ముందుకు వచ్చి వికారంగా ఉండటం, బెల్లీ ఫ్యాట్ పెరిగిన స్పష్టమైన లక్షణాలు.


బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది అంటే :

బెల్లీ ఫ్యాట్ అనేది మనం తినే ఆహారంలో ఉన్న అధిక కాలరీలు, ఆయిల్, స్వీట్స్ వల్ల పేరుకుపోతుంది. ఈ ఫ్యాట్ ముఖ్యంగా పొట్ట కింద భాగంలో పేరుకుపోయి శరీరాకృతిని పూర్తిగా చెడగొడుతుంది. ఏదైనా డ్రెస్ వేసుకున్నా, ఫంక్షన్ లేదా పార్టీకి వెళ్ళినా ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి వ్యాయామం, డైట్, టిప్స్, మెడిసిన్స్ అన్నీ ప్రయత్నిస్తున్నా కొంతమందికి ఇది కరగడం కష్టమే. ఎందుకంటే ఈ సమస్యకు మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని . అవేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


1. బ్రేక్‌ఫాస్ట్ మానేయడం: కొంతమంది ఉదయం వ్యాయామం చేసిన తర్వాత టిఫిన్ తినకుండా నేరుగా మధ్యాహ్న భోజనం చేస్తారు. ఇది పెద్ద తప్పు అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే సరైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. ఉదయం తినే ఆహారం శరీరానికి రోజంతా పని చేసే శక్తిని ఇస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల శరీరంలో మెటాబాలిజం తగ్గిపోతుంది, ఫ్యాట్ ఎక్కువగా పేరుకుపోతుంది.

2. రాత్రి తినగానే పడుకోవడం: రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవడం మరో పెద్ద తప్పు. భోజనం చేసిన తర్వాత కనీసం 2 గంటలు గ్యాప్ ఉండాలి. తిన్న ఆహారం జీర్ణం అవ్వక ముందే పడుకుంటే, అది నేరుగా పొట్టలో కొవ్వుగా పేరుకుపోతుంది.
రాత్రి భోజనం తేలికగా, త్వరగా చేయడం మంచిది.

3. ఎక్కువసేపు కూర్చోవడం: ఇప్పుడు చాలా మంది కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చునే అలవాటు పెంచుకున్నారు.. భోజనం చేసిన వెంటనే కూర్చోవడం లేదా పని చేయడం జీర్ణక్రియను అడ్డుకుంటుంది. కొందరు కంప్యూటర్ ముందు కూర్చుని వర్క్ చేస్తూ తినడం కూడా చేస్తున్నారు. ఇది చాలా హానికరం. ఈ అలవాటు వల్ల శరీరంలో జీర్ణక్రియ సరిగ్గా జరగక, ఫ్యాట్ వేగంగా పేరుకుపోతుంది.

బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి పాటించాల్సిన చిట్కాలు:

బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం అంత కష్టం కాదు. మనం కొన్ని చిన్న అలవాట్లను మార్చుకుంటే బెల్లీ ఫ్యాట్ సులభంగా కరుగుతుంది. డాక్టర్లు సూచిస్తున్న ముఖ్యమైన పద్ధతులు ఇవి:

సరైన ఆహారపు అలవాట్లు, స్వీట్స్, ఆయిల్ ఫుడ్, అధిక కార్బోహైడ్రేట్స్‌ను తగ్గించాలి. ప్రోటీన్, ఫైబర్, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. చిన్న చిన్న మీల్స్‌ను ఎక్కువసార్లు తినడం ద్వారా మెటాబాలిజం పెరుగుతుంది. నిత్య వ్యాయామం మరియు నడక..ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవాలి.యోగా, ప్రాణాయామం, కార్డియో వ్యాయామాలు బెల్లీ ఫ్యాట్ కరుగించడంలో సహాయపడతాయి.ఉదయం వ్యాయామం తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా తినాలి.నీరు ఎక్కువగా తాగడం మంచిది. రోజుకు 3-4 లీటర్ల నీరు తాగడం శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది. పనిమనుషులపై ఆధారపడకుండా మన పనులు మనమే చేసుకోవాలి. ఇలా చేస్తే సహజంగానే శరీరం కదులుతుంది, కాలరీలు కరుగుతాయి.

బెల్లీ ఫ్యాట్ తగ్గించడం కేవలం డైట్‌లు, మెడిసిన్స్‌తో సాధ్యం కాదు. సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం, కచ్చిత నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడం ఇవన్నీ పాటిస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా, నిత్యజీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారానే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. చిన్న వయసులోనే ఈ అలవాట్లు పెంచుకుంటే భవిష్యత్తులో ఒబిసిటీ, డయాబెటిస్, హార్ట్ సమస్యలు వంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: