
మన శరీరంలో హార్మోన్లు సమతుల్యం కావాలంటే, కొన్ని ముఖ్యమైన పనులు తప్పనిసరిగా చేయాలి అని వైద్యులు సూచిస్తున్నారు. అందులో ఫిజికల్ యాక్టివిటీ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా చెప్పబడింది. రోజూ జాగింగ్ చేయడం, వాకింగ్ చేయడం, ఎక్సర్సైజులు చేయడం ద్వారా మన శరీరంలో పాజిటివ్ హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతాయి. ఇవి మన శరీరానికి మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతతకు కూడా చాలా అవసరం.అదేవిధంగా మైండ్ రిలాక్సేషన్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మనం మానసికంగా ప్రశాంతంగా ఉండకపోతే, శరీరానికి సంబంధించిన అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ నేపథ్యంలో ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా ఒక ఆసక్తికరమైన అధ్యయనం చేసింది. అందులో “హగ్ థెరపీ” అనేది మానసిక ఆరోగ్యానికి అద్భుత ఫలితాలను ఇస్తుందని తేలింది.
ఒకరినొకరు హగ్ చేసుకోవడం వలన మన శరీరంలో ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ విడుదల అవుతుంది. దీన్ని చాలామంది తెలియకుండా ఉంటారు. ఈ హార్మోన్ విడుదలవడం వలన మన మనసులో ఉన్న టెన్షన్, బాధలు, ఒత్తిడి అన్నీ తేలికవుతాయి. ఒక్కసారిగా మనసు ప్రశాంతంగా మారుతుంది. డాక్టర్లు చెబుతున్న దాని ప్రకారం, రోజుకు కనీసం 4 నుంచి 8 సార్లు హగ్ చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా స్ట్రెస్ మొత్తం తగ్గిపోతుంది.హగ్ మాత్రమే కాదు, మనం ఒకరిని ఒకరు చిరునవ్వుతో పలకరించడం, స్నేహపూర్వకంగా మాట్లాడటం కూడా మానసిక ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అసలు మనకు పరిచయం లేని వారితో కూడా చిరునవ్వుతో మాట్లాడటం, పలకరించడం వలన మనలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కానీ మనకు దగ్గరైన వారిని, ముఖ్యంగా మన జీవిత భాగస్వామిని హగ్ చేసుకోవడం వలన మన సంబంధాలు మరింత బలపడటమే కాకుండా, మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి రెండింటికీ చాలా మేలు జరుగుతుంది.
అందువల్ల, డాక్టర్లు సూచిస్తున్న ఒక ముఖ్యమైన సందేశం ఏమిటంటే – మీకు వీలైతే ఎన్ని సార్లు సాధ్యమైతే అన్ని సార్లు మీ స్వీట్ భాగస్వామిని హగ్ చేసుకోండి. ఇది మీ ఆరోగ్యానికి కూడా మంచిది, మీ వైవాహిక జీవితానికి కూడా బలమైన పునాది వేస్తుంది.