కొన్ని రకాల పద్దతులను ఒక పద్దతి ప్రకారం టైమ్‌టేబుల్ వేసుకుని  ఒక దాని తరువాత ఒకటి పాటించటం వలన ఎత్తును సులభంగా పెంచుకోవచ్చు. ఎత్తు పెరుగుటకు తయారు చేసుకునే ప్రణాళికలో సరైన ఆహరం, వ్యాయామాలు, సరైన సమయం పాటూ నిద్ర మరియు ఆరోగ్యకర స్థాయిలో రోగనిరోధక వ్యవస్థను నిర్వహించటం వలన ఎత్తు పెరుగవచ్చు. ఎత్తు పెరగాలి అనుకునే వారు మొదటగా ఎత్తు పెరగటంపై జన్యుప్రభావం ఎంత ఉంటుందో తెలుసుకోవాలి. సాధారణంగా ఎత్తు అనేది జన్యుపర సంబంధిత లక్షణం, మీ కుటుంబ సభ్యులు ఉన్న ఎత్తులో మీరు ఉంటారు. అనగా వారు ఎత్తు తక్కువగా ఉంటె మీరు తక్కువ ఎత్తులో ఉంటారు. ఇది చదివి నిరాశ పడకండి. వాతావరణ పరంగా లేదా జన్యుపరంగా సంక్రమించిన ఎత్తును ప్రభావిత చేసే అంశాలు అందుబాటులో ఉన్నాయి.

 

కొన్ని కఠిన నియమాలను అనుసరించటం వలన మీ ఎత్తు పెంచుకోవచ్చు. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది. వ్యాయామాలు అని వినగానే ”ప్రతి సమస్యకు వ్యాయామాలు పరిష్కారమా” అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అవును వ్యాయామాల వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. రోజు తీవ్రమైన వ్యాయామాలను అనుసరించటం వలన మంచి మంచి ఫలితాలను పొందుతారు. తీవ్రమైన వ్యాయమాల వలన శరీరం లోపల కలిగిన గాయాలు, కాళ్ళపై కలిగే ఒత్తిడి, వెన్నుపూసలో ఉండే సమస్యలు అన్ని వ్యాయామాల వలన తగ్గిపోతాయి. ప్రతి రోజు చేతులు పైకి లేపి, వెనకకి వంగి, అలానే 10 సెకన్ల పాటూ ఉండండి. అంతేకాకుండా, ఈత కూడా ఎత్తు పెరుగుటలో సహాయపడే వ్యాయామంగా చెప్పవచ్చు. ఈత వలన శరీరంలో ఉండే ఒత్తిడిని తగ్గించి, కీళ్ళపై ప్రభావాన్ని చూపి విస్తరింపచేస్తుంది. ఇలా కొన్ని రోజు అనుసరించటం వలన మీ ఎత్తులో మంచి ఫలితాలను పొందుతారు.

 


మీ ఎత్తు పెరుగుటకు ముఖ్యంగా అవసరమైనవి పోషకాలు. ఆరోగ్యంగా ఉండటకు మాత్రమె ఎత్తు పరుగుటకు కూడా ఇవి చాలా అవసరం అని చెప్పవచ్చు. మీరు తినే ఆహరంలో సరైన స్థాయిలో విటమిన్’లు మరియు మినరల్’లు ఉండేలా చూసుకోవాలి. మీరు ఎత్తు పెరగాలి అనుకుంటే ఇక్కడ తెలిపిన పోషకాలు మరియు మూలకాలు మీ ఆహరంలో ఉండేలా జాగ్రత్త పడండి. ప్రోటీన్స్, ఎత్తు పెరుగుటను ప్రోత్సహించే మూలకంగా దీన్ని పేర్కొనవచ్చు, కావున మీరు తీసుకునే రోజు ఆహరంలో ఇది ఉండేలా చూసుకోండి. ప్రోటీన్ ఎక్కువగా మాంసం, గుడ్లు, టోఫూ మరియు పప్పుదినుసులు వంటి వాటిని సమర్థవంతమైన పెరుగుదల కోసం తీసుకోండి.


చిన్న పిల్లలలో జింక్ మూలకం లోపం వలన పెరుగుదల నిలిచిపోయే అవకాశం ఉంది. కావున జింక్ మూలకాన్ని తీసుకోటాన్ని అధికం చేయండి. జింక్ ఎక్కువగా ఉండే చాక్లెట్, పీనట్, గుడ్డు వంటి వాటిని ఎత్తు పెరుగుటకు తయారు చేసుకున్న ఆహర ప్రణాళికలో కలపండి.

మరింత సమాచారం తెలుసుకోండి: