ఇప్పుడు ప్రతి పిల్లల చేతిలో మొబైల్ ఫోన్ అనేది సర్వసాధారణం అయిపొయింది. ఈ ఫోన్ వాళ్ళ పిల్లలు ఏమి కోల్పోతున్నారో వాళ్ళకే తెలియడంలేదు.హింసాత్మాక ధోరణికి బాగా అలవాటు పడిపోతున్నారు పిల్లలు. మాములుగా   16-19 ఏళ్ల మధ్య వయసున్న వారిలో ఎక్కువ కోపం ఉంటుంది. అదే  20-26 ఏళ్ల మధ్య వయసున్న వారిలో తక్కువ కోపం ఉంటుందట.  దీనిని బట్టి యవ్వనప్రాయంలో కన్నా టీనేజీలోనే ఎక్కువ కోపం ఉన్నట్లు తెలుస్తుంది. 

 

అదే సమయంలో బాలికలతో పోలిస్తే, బాలురలో కోపం ఎక్కువగా ఉంటుంది.  12-17 ఏళ్ల వయసు బాలికల్లో 19 శాతం మంది పాఠశాలలో ఏదో ఒక రకమైన వివాదంలో చిక్కుకున్నారని తేలింది. దీనికి కారణం తెలిస్తే అవాక్కు అవుతారు. పెద్ద పట్టణాలలో తల్లిదండ్రులు తమ పిల్లలపై పూర్తిగా దృష్టి పెట్టలేరు. ఏదో పని ఇవ్వడం అనే నెపం మీద వాళ్లకు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు. అలాంటి సందర్భంలో పిల్లలు మొబైల్ ఫోన్లలో హింసాత్మక ధోరణి కలిగిన గేమ్స్ ఆడుతున్నారు. హింసాత్మక ప్రవృత్తి కలిగిన పిల్లలంతా రోజులో కనీసం మూడునాలుగు గంటలు వీడియో గేమ్స్ ఆడుతున్నారని తెలిసింది.

 

ఈ ఆటల్లో ప్రత్యర్థిని అంతమొందించినప్పుడే వాళ్ళు గెలుస్తారు. అలా మొబైల్ గేమ్స్ పిల్లల మనస్తత్వాన్ని మెల్లగా మార్చేస్తాయి..ఒకసారి పిల్లల చేతికి మొబైల్ ఫోన్ అందితే, దాంతో యూట్యూబ్ వీడియోల నుంచి పోర్న్ దృశ్యాల వరకు అందుబాటులోకి వస్తాయి.అలాంటివి చూసి పిల్లలు తప్పుదోవ పడుతున్నారు.అందుకే ప్రతి తల్లితండ్రులు పిల్లలపై శ్రద్ద పెట్టాలి. 

 

తల్లిదండ్రులు పిల్లల ముందు  తాము స్వయంగా కొట్లాడుకుంటూ పిల్లలను మాత్రం సరిగా ప్రవర్తించమంటే పిల్లలు వినరు. అలాంటప్పుడు వాళ్లలోనూ హింసాత్మక ప్రవృత్తి  ఎక్కువ అవుతుంది.  పిల్లలు తమకు నచ్చినట్లుగా ఉండాలనకుంటారు. అలా జరగనప్పుడు వాళ్లు చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతారు. "పిల్లలు పాఠశాలలో తోటి పిల్లలతో గొడవపడుతుంటే లేదా వాళ్లను తిడుతుంటే, చదువుపై శ్రద్ధ పెట్టకుంటే.. మీరు పిల్లల మీద దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని అర్థం'' అలాంటప్పుడు వాళ్ల కోసం సమయం కేటాయించాలి. వాళ్లతో పాటు బైటికి వెళ్లి వాళ్లతో రకరకాల ఆటలు ఆడించాలి. వాళ్లతో మాట్లాడాలి.

 

 

వాళ్లు చేసే ప్రతి పనిలో తప్పులు వెదకడం మానేయాలి. ఎందుకంటే వాళ్ల వ్యక్తిత్వం రూపుదిద్దుకునే సమయం అదే.అసలు ఇప్పుడు ఉన్న కాలంలో ఎంతమంది తల్లితండ్రులు పిల్లలతో ఆడుతూ పాడుతూ ఉంటున్నారో మీరే విశ్లేషించుకోండి. ఎంతసేపు ఫోన్ ఇంట్లో ప్రతోడు ఒక్కరికి ఫోన్ ఉండాలిసిందే. పెద్దల నుంచి పిల్లలు దాక ఫోన్ కావాలి.ఇంకా కుటుంభంలో ఆప్యాయత అనురాగాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి.. 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: